SGSTV NEWS online
Andhra PradeshCrime

యువకుడిపై కత్తిపోట్ల కలకలం..! విచక్షణారహితంగా దాడి..



అన్నమయ్య: జిల్లాలో పాత గొడవలు మరోసారి హింసకు దారితీశాయి. తంబళ్లపల్లి నియోజకవర్గం అంగళ్లు వద్ద ఓ యువకుడిపై కత్తితో దాడి జరిగింది. పాత కక్షలను మనసులో పెట్టుకున్న ఓ వ్యక్తి కత్తితో విచక్షణారహితంగా దాడి చేయడంతో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు.

కమతంపల్లికి చెందిన విశ్వనాథ్‌ (38)పై నల్ల చంద్ర కత్తితో దాడికి పాల్పడినట్లు సమాచారం. గతంలో జరిగిన ఓ గొడవ విషయంలో విశ్వనాథ్‌ అడ్డుపడ్డారనే కారణంతో చంద్ర కక్ష పెంచుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే పాత కక్షలతో దాడి చేసినట్లు సమాచారం.

కత్తిపోట్లతో తీవ్రంగా గాయపడిన విశ్వనాథ్‌ను చికిత్స నిమిత్తం మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు గల పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Also read

Related posts