ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో 240 మంది బాధితులు
ముఠా సభ్యుల్లో ముగ్గురి అరెస్టు
ఆదిలాబాద్ , : విద్యాశాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఏజెన్సీల ముసుగులో భారీ మోసానికి పాల్పడ్డ ముఠా గుట్టు రట్టయింది.
నిందితులపై ఆదిలాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ముగ్గురు ఏజెంట్లతో పాటు ముఠా సభ్యుల్లో ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ శనివారం వివరాలు వెల్లడించారు. వరంగల్ గిర్మాజీపేటకు చెందిన జట్టబోయిన మధుకిరణ్ (ప్రస్తుత హైదరాబాద్లోని మేడిపల్లి), హనుమకొండ వెంకటాపురి నివాసి మాదాసి సుధాకర్ (ప్రస్తుతం హైదరాబాద్లోని బోడుప్పల్), నిమ్మని సతీష్(గోదావరిఖని), హైదరాబాద్కు చెందిన సుజాత ఠాకూర్, లావణ్య (అల్వాల్) ముఠాగా ఏర్పడి… అనంత సొల్యూషన్, విద్యాదాన్ ఆర్గనైజేషన్ పేరిట సంస్థలను ఏర్పాటు చేశారు. పాఠశాలలు, కళాశాలల్లో విద్యాంజలి-2.0 పేరిట కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకం కింద ఉద్యోగాలున్నాయంటూ నిరుద్యోగులకు వల వేశారు.
ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో ఏజెంట్లను నియమించుకొని… సుమారు 240 మంది నిరుద్యోగుల నుంచి రూ. లక్ష, రూ. రెండున్నర లక్షలు చొప్పున దాదాపు రూ.5 కోట్ల వరకు వసూలు చేశారు. వారికి నకిలీ నియామక పత్రాలు అందించి… ఒకట్రెండు నెలలు వేతనాలు చెల్లించారు. ఆ తర్వాత జీతాలు రాకపోవటంతో మోసపోయినట్లు గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించటంతో ముఠా బండారం బయటపడింది. వీరికి ఏజెంట్లుగా వ్యవహరించిన బోథ్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ కోవ విఠల్, రాహుల్, వరలక్ష్మిలతో పాటు మోసంలో ప్రధాన సూత్రధారులైన జట్టబోయిన మధుకిరణ్, మాదాసి సుధాకర్, నిమ్మని సతీష్లను అరెస్టు చేశామని, పరారీలో ఉన్న సుజాత ఠాకూర్, లావణ్యల కోసం గాలిస్తున్నామని ఎస్పీ తెలిపారు. అరెస్టయిన నిందితుల చిత్రాలను పోలీసులు శనివారం విడుదల చేశారు.
Also read
- Medak: ప్రేమ పెళ్లి.. పేరెంట్స్‌ను కౌన్సిలింగ్‌కు పిలిచిన పోలీసులు.. ఆపై ఊహించని సీన్..
- Hyderabad: కుటుంబ సమేతంగా ఆత్మహత్యాయత్నం.. ఒక్క ఫోన్ కాల్ జీవితాలనే మార్చేసింది..!
- Ratha Saptami 2026: దరిద్రం వదిలి ఐశ్వర్యం వస్తుంది!.. రథ సప్తమి నాడు ఏ రాశి వారు ఏం దానం చేయాలి?
- Moon Transit: చంద్ర సంచారం.. ఈ మూడు రాశులకు జాక్‌పాట్.. ఊహించని లాభాలు!
- భార్యను చంపేశానంటూ పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన భర్త.. విచారణలో సంచలనాలు..!





