October 16, 2024
SGSTV NEWS
CrimeTelangana

సకాలంలో వైద్యం అందక నిండు గర్భిణి మృతి



సకాలంలో వైద్యం అందకపోవడంతో కడుపులో బిడ్డతో సహా గర్భిణి మృతి చెందారు. పీహెచ్సీ నిర్లక్ష్యమని కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగగా.. తమ సిబ్బంది నిర్లక్ష్యం లేదని వైద్యుడు తెలిపారు.

దుమ్ముగూడెం, : సకాలంలో వైద్యం అందకపోవడంతో కడుపులో బిడ్డతో సహా గర్భిణి మృతి చెందారు. పీహెచ్సీ నిర్లక్ష్యమని కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగగా.. తమ సిబ్బంది నిర్లక్ష్యం లేదని వైద్యుడు తెలిపారు. వివరాలివీ… చింతగుప్ప గ్రామానికి చెందిన గర్భిణి ఉయికా సమ్మక్క(26)ను కుటుంబ సభ్యులు కాన్పు నిమిత్తం ఆదివారం ఉదయం 5.30 గంటలకు దుమ్ముగూడెం పీహెచ్సీకి తీసుకొచ్చారు. ఆదివారం సెలవు కావడంతో వైద్యాధికారి పుల్లారెడ్డి లేరు. సిబ్బంది ఆమెను ఆసుపత్రిలో చేర్చుకుని వైద్య పరీక్షలు నిర్వహించారు. మధ్యాహ్నం ఒంటి గంటల సమయానికి ఆమె ఆరోగ్యం ఆందోళనకరంగా మారింది. సిబ్బంది ఆమెను 108 వాహనంలో భద్రాచలం ప్రభుత్వ  ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యాధికారులు అప్పటికే ఆమె బిడ్డతో సహా మృతి చెందినట్లు తెలిపారు. దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు ఆమె మృతదేహాన్ని రాత్రి 8 గంటల సమయంలో దుమ్ముగూడెం తీసుకువచ్చారు. పీహెచ్సీ ఎదుట ఆందోళన చేపట్టారు. వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే సమ్మక్క మృతి చెందారని, చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం జరిగేలా కృషిచేస్తామని సీఐ అశోక్ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. తాను విధుల్లో లేకపోవడంతో భద్రాచలం తీసుకెళ్లాలని సిబ్బంది సమ్మక్క కుటుంబీకులకు సూచించినా వారు జాప్యం చేశారని వైద్యాధికారి పుల్లారెడ్డి వివరించారు.




Also read

Related posts

Share via