ఉత్తరప్రదేశ్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. భార్య భర్తల మధ్య మొదలైన గొడవలో భర్తపై విచక్షణారహితంగా దాడి చేసిన భార్య అతని జననేంద్రియాలను కోసివేసింది. ఆ తర్వాత ఆమె యాసిడ్ తాగి ఆత్మహత్యకు యత్నించింది. గమనించిన కుటుంబ సభ్యులు ఇద్దరిని హాస్పిటల్‌కు తరలించారు. ఈ ఘటన సంభాల్ జిల్లాలో చోటుచేసుకుంది.
భార్యభర్తల మధ్య మొదలైన గొడవలో భర్తపై భార్య విచక్షణారహితంగా దాడి చేసి అతని జననేంద్రియాలను కోసి వేసిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. సంభాల్ జిల్లా అస్మోలీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో నివసిస్తున్న ఇద్దరి భార్యభర్తలకు నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. అయితే పెళ్లైన కొన్నాళ్ల తర్వాత భర్తతో పాటు అత్తింటి వారు తనను మానసికంగా, కట్నం కోసం తరచూ హింసిస్తూ వేధిస్తున్నారని ఆ మహిళ ఆరోపించింది. ఆమె సోదరుడు కూడా ఇదే విషయాన్ని పోలీసుల దృష్టికి తెచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఈ ఇటీవల భార్యభర్తల మధ్య మరోసారి గొడవ జరిగినట్టు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో గొడవలతో విసిగిపోయిన భార్య కోపంలో భర్తపై విచక్షణారహితంగా దాడి చేసి అతని జననేంద్రియాలను కోసి వేసినట్టు తెలుస్తోంది. తీవ్రంగా గాయపడిన భర్తను కుటుంబ సభ్యులు స్థానిక ఆసుపత్రికి తరలించారు.
అయితే, భర్తపై దాడి చేసిన కాసేపటికే భార్య ఇంట్లో ఉన్న యాసిడ్ తాగి ఆత్మహత్యకు యత్నించింది. దీంతో ఆమెను కూడా హాస్పిటల్‌కు తరలించారు కుటుంబసభ్యులు. ప్రస్తుతం భార్య భర్తలు ఇద్దరూ జిల్లా ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఇక ఈ ఘటనపై స్థానిక పోలీసులు స్పందించారు. భర్తపై భార్య దాడి చేసిన దాడిని వారు నిర్ధారించారు. అయితే ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు
Also read
- Air India: అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో సైబర్ దాడి కోణం..? ఆపరేటింగ్ సిస్టమ్ హ్యాక్ చేసి..
- బ్లాక్ బాక్స్ ఏ రంగులో ఉంటుంది..? విమానంలో ఏ భాగంలో ఉంటుంది..? ఇది గ్రూప్1 ప్రిలిమ్స్ ప్రశ్న
- తొలిసారి భారత్‌లో మొదలైన బ్లాక్‌బాక్స్ డీకోడింగ్ ప్రక్రియ.. ఏ ఒక్క క్లూని వదలని దర్యాప్తు సంస్థలు!
- విమాన శిథిలాల్లో దొరికిన కీలక క్లూ.. DVRను విశ్లేషించనున్న FSL బృందం
- ఎయిరిండియా విమానం కూలిపోవడానికి కారణాలివేనా.? షాకింగ్ విషయాలు చెప్పిన అమెరికా నిపుణులు