తన తల్లి ఉండగా రెండో పెళ్లికి సిద్ధం అయిన తండ్రిని కన్న కొడుకు గొడ్డలితో నరికి చంపాడు. కామారెడ్డి జిల్లాలో జరిగిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. తన తల్లిని వదిలి రెండో వివాహం చేసుకుంటానని, తండ్రి వేధించడంతో విసుగు చెందిన కొడుకు ఈ ఘాతుకానికి పాల్పడ్డట్లు పోలీసులు తెలిపారు. తండ్రిని గొడ్డలితో నరికి చంపేశాడు. ఈ సంఘటనకు సంబంధించిన కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు.
కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం అయ్యపల్లి తండాకు చెందిన దేవ సోత్ ఫకీరాకు(46)కు పంగీ అనే మహిళతో 25 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి ప్రకాష్ నాయక్ తోపాటు పెళ్ళైన కూతురు ఉంది. ఇదిలా ఉండగా ఫకీరా పర్మల్ల తండాకు చెందిన మరొక యువతిని రెండో వివాహం చేసుకోవడానికి సిద్ధమైనట్లు గ్రామస్థులు తెలిపారు. పెళ్లీడుకు వచ్చిన కొడుకు ఉండగా తండ్రి రెండో వివాహం చేసుకుంటా అనడంతో తండ్రి కొడుకుల మధ్య గొడవలు జరిగేవి.
తండ్రి రెండో వివాహ విషయమై తండ్రీకొడుకులు గత సంవత్సర కాలంగా తరచూ గొడవలు పడుతున్నారని తండావాసులు తెలిపారు. ఘర్షణ పడిన ప్రతిసారీ కుటుంబ సభ్యులు బంధువులు సర్ది చెప్పేవారు. ఈ క్రమంలో శనివారం(మే 24) రాత్రి సైతం తండ్రి కొడుకులు గొడవ పడ్డారు. ఫకీరా కొద్ది నెలల క్రితం నూతన గృహాన్ని నిర్మించుకుని గృహప్రవేశం కూడా చేశారు. నిన్న రాత్రి తండ్రి కొడుకులు గొడవ పడుతున్న సందర్భంగా గ్యాస్ సిలిండర్ కు నిప్పంటించి నూతన గృహాన్ని పేల్చేస్తా అని ఫకీరా అనడంతో కోపోద్రికుడైన కుమారుడు ప్రకాష్ పక్కనే ఉన్న గొడ్డలితో తండ్రిని నరకడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
తండ్రిని కుమారుడు చంపిన విషయాన్ని తండావాసులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనాస్థలానికి చేరుకున్న లింగంపేట పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఫకీరా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు
Also read
- చంద్రిక నన్ను క్షమించు.. నీకు ఇచ్చిన మాట తప్పాను
- Andhra News: నిత్యం తాగొచ్చిన తల్లిని వేధిస్తున్న తండ్రి.. తల్లి బాధ చూడలేక కొడుకు ఏం చేశాడంటే?
- Warangal: అత్త బంగారంపై కన్నేసిన అల్లుడు.. వాటిని కాజేసేందుకు ఏం చేశాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
- Chittoor: తాగునీటిని పట్టుకునేందుకు వచ్చిన గ్రామస్తులు.. అక్కడ కనిపించిన సీన్ చూడగానే..
- Air India: అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో సైబర్ దాడి కోణం..? ఆపరేటింగ్ సిస్టమ్ హ్యాక్ చేసి..