మహబూబ్ నగర్ జిల్లాలో దారుణం.. ఇద్దరు యువకుల అరెస్టు
మహబూబ్ నగర్ : ప్రేమ జంటను బెదిరించి డబ్బులు వసూలు చేసిన ఇద్దరు యువకులు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహబూబ్ నగర్ గ్రామీణ సీఐ గాంధీనాయక్ కథనం ప్రకారం.. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలానికి చెందిన యువకుడు, బాలిక(17)మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండల పరిధిలోని పిల్లిగుండుతండా వద్ద ఉన్న అటవీ ప్రాంతానికి శుక్రవారం వచ్చారు. వీరు అటవీ ప్రాంతంలోకి వెళ్లగానే అక్కడ కూలి పనులు చేస్తున్న అశోక్ కుమార్ (26), లక్ష్మణ్(27) గమనించారు. కొద్దిసేపటి తర్వాత వారిని పట్టుకొని బెదిరించారు. డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆ యువకుడు తన వద్ద డబ్బులు లేవని చెప్పినా వినలేదు. బెదిరించడంతో తన స్నేహితుడికి ఫోన్‌చేసి రూ.6,500 నిందితులకు ఫోన్‌పే చేయించాడు. తర్వాత యువకుడి ముందే బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయాన్ని బాధితురాలు తల్లికి చెప్పగా ఆమె హన్వాడ పోలీసులను ఆశ్రయించడంతో నిందితులపై పోక్సో కేసు నమోదు చేసి శనివారం అరెస్టు చేసి రిమాండు తరలించారు.
Also read
- పోలీస్ స్టేషన్లో కాల్పుల కలకలం.. AK-47తో కాల్చుకుని ఎస్ఐ ఆత్మహత్యాయత్నం!
- మధ్యాహ్న భోజన పథకం కార్మికుల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి….. గ్రీష్మ కుమార్, ఐ.యఫ్‌టియు రాష్ట్ర కమిటీ సభ్యులు.
- Ganesh Chaturthi: గణేశుడికి ఏనుగు తల ఎలా వచ్చింది? గజాసురుడి తలనే ఎందుకు పెట్టారు.. అసలు కథ ఇదే!
- భాద్రపద మాసం.. వినాయక చవితి నుంచి మహాలయ అమావాస్య వరకు.. ఈ మాసంలోని పండగలివే!
- వినాయక చవితి వేళ అద్భుత గ్రహ యోగాలు.. ఈ రాశుల వారికి గణపతి ఆశీస్సులతో పట్టిందల్లా బంగారమే!





