హైదరాబాద్: ఆ దంపతులకు ఏం కష్టం వచ్చిందో ఏమో
బలవన్మరణానికి పాల్పడ్డారు. వివాహమైన 55 రోజులకే తనువు చాలించారు. మిస్టరీగా మారిన ఈ విషాద ఘటన కూకట్పల్లి పోలీస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికులు, బంధువులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కుమ్మరి బస్తీకి చెందిన కార్తీక్ (28)కు గత మార్చి 8న ప్రశాంత్నగర్ రాజీవ్ంధీ నగర్కు చెందిన మంజుల ఎలియాస్ జ్ఞాన్షిక (27)తో వివాహమైంది.
కార్తీక్ ఐటీసీ కంపెనీలో మార్కెటింగ్ ఉద్యోగం చేస్తుండగా.. మంజుల ఫ్యాబ్రిక్ పెయింటింగ్ చేస్తున్నారు. శుక్రవారం తెలిసినవారి ఇంటిలో జరిగిన సత్యనారాయణ స్వామి వ్రతానికి మంజుల వెళ్లి వచ్చింది. అనంతరం ప్రశాంత్నగర్లో తల్లి ఇంటికి భర్తతో కలిసి వెళ్లి వచ్చింది. రాత్రి భోజనాలనంతరం కార్తీక్, మంజుల వారి గదిలో నిద్రించారు. శనివారం ఉదయం 9.30 గంటలైనా ఇంటి తలుపులు తీయలేదు.
ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో కుటుంబ సభ్యులు తలుపులు పగులగొట్టి చూడగా.. కార్తీక్ తలుపుపై ఉన్న వెంటిలేటర్కు వైర్ తో ఉరి వేసుకున్నాడు. మంజుల బెడ్పై నోట్లో నురగలతో కనిపించింది. ఆస్పత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. మంజుల తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. దంపతులు ఆత్మహత్యకు కారణాలేమిటో తెలియడంలేదని కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు.
Also read
- మరణానంతరం ఆత్మ 13 రోజులు కుటుంబంతోనే ఉంటుందా? గరుడ పురాణం చెప్పే నిజం ఏమిటి?
- Weekly Horoscope: ఆ రాశుల వారికి ఆదాయం పెరిగి ఆర్థిక సమస్యలకు చెక్..!
- లక్షకు రూ.30 వేల వడ్డీ.. రూ.25 కోట్లు వసూల్.. ఈ కిలాడి జంట చేసిన పని తెలిస్తే నోరెళ్లబెడతారు..
- ఐపీఎల్ క్రేజ్‌ను క్యాష్ చేసుకున్న కిలాడీలు.. అసలు వీరు వాడిన టెక్నిక్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
- హైవేపై రోడ్డు ప్రమాదం.. ఆ పక్కనే కనిపించిన సూసైడ్ నోట్.. ఓపెన్ చేయగా..





