బాలాపూర్: చిట్ ఫండ్ పేరుతో కాలనీవాసులను మోసం సంఘటన హైదరాబాద్ కమిషనరేట్ మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శివ నారాయణపురం వైష్ణవి కాలనీలో చోటుచేసుకుంది. వెంకట సాయి చిట్ ఫండ్స్ పేరుతో వైష్ణవి కాలనీ అధ్యక్షుడు సురేష్ కుమార్, అతని భార్య గత పదేళ్లుగా చిట్టీలు నిర్వహిస్తూ, ప్రజల నుంచి భారీ మొత్తంలో డబ్బులు సేకరించారని బాధితులు పేర్కొన్నారు. కాలనీవాసుల ప్రకారం, సుమారు 25 మందికి పైగా బాధితులు రూ.2.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు చిట్టీలో పెట్టుబడి పెట్టారు. చిట్టీ గడువు ముగిసిన తరువాత కూడా వారికి డబ్బులు తిరిగి ఇవ్వకపోగా, చెక్కులు, ప్రామిసరీ నోట్లు ఇచ్చి కాలయాపన చేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరికొందరు కూడా ఇలాగే మోసపోయారని, మొత్తం వ్యవహారంలో దాదాపు రూ.2 కోట్లు వరకు మోసం చేశారని బాధితులు చెబుతున్నారు.
Also read
- బ్రహ్మ ముహూర్తమే కాదు.. సాయంత్రం ఈ గంటలో దీపం వెలిగిస్తే లక్ష్మీ కటాక్షం, రాజయోగం కలుగుతాయట!
- నిజ జ్యేష్ఠ మాసం మొదలు.. ఈ పూజలు, దానాలు చేస్తే ఐశ్వర్యం, ఆరోగ్యం మీ సొంతమట!
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- పాము కాటు.. తండ్రి పగ.. కొడుకును చంపిన త్రాచును వేటాడి చంపాడు.. ఎక్కడంటే..
- ఏంటక్కా మరీ ఇలా ఉన్నావ్.. స్కెచ్ వేసింది.. సైలెంట్‌గా సెలైన్‌తో పనికానిచ్చేసింది





