పూసపాటిరేగ (విజయనగరం జిల్లా) : వెయ్యి రూపాయల కోసం ఇద్దరు స్నేహితుల మధ్య తలెత్తిన వివాదం చివరికి హత్యకు దారితీసింది. ఈ సంఘటన విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలంలోని ఎరుకొండ గ్రామంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు, గ్రామస్తులు తెలపిన వివరాల మేరకు… ఎరుకొండకు చెందిన గొర్రెల నవీన్ (21), బొంతు అప్పలనాయుడు స్నేహితులు. ఇద్దరూ కార్మికులు. ఆదివారం గ్రామంలో ఓ ఇంటికి పెయింటింగ్ వేసి, పని పూర్తయ్యాక సాయంత్రం ఇద్దరూ కలిసి పూటుగా మద్యం తాగారు. రాత్రి పది గంటల సమయంలో స్నేహితుల మధ్య రూ.వెయ్యి డబ్బుల కోసం ఘర్షణ మొదలైంది. ఘర్షణ అనంతరం తన ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్న నవీన్‌పై బైక్‌పై వచ్చిన అప్పలనాయుడు వెనుక నుంచి నవీన్‌పై పడ్డాడు. నవీన్ ఇంటి ముందే ఇద్దరూ ఘర్షణపడ్డారు. తన వెంట తెచ్చుకున్న కత్తితో నవీన్ ఛాతిపై, కడుపులో అప్పలనాయుడు పొడిచాడు. బయట ఘర్షణ జరుగుతుండడంతో ఇంట్లో నుంచి నవీన్ తల్లి వచ్చి చూడగా ఆమె చేతిలో కుమారుడు ప్రాణం విడిచాడు. గ్రామస్తుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సుందరపేట సిహెచ్సి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ రామకృష్ణ తెలిపారు.
Also Read
- మరణం తర్వాత ఆత్మ ఎక్కడికి వెళుతుంది? గరుడ పురాణం చెప్పిన ఆశ్చర్యకర నిజాలు
- పుట్టినరోజు ఎలా జరుపుకోవాలి
- Shiv Temple: గర్భగుడిలో లింగం, నందీ లేదు.. ధ్వజస్తంభమూ లేదు.. అయినా భక్తులతో కిటకిటలాడే ఈ శివాలయం ఎక్కడుందో తెలుసా?
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- Tuni: తుని బాలిక మిస్సింగ్ కేసులో కీలక అప్ డేట్.. చిన్న పిల్ల ఏడుపు వినిపించిదని..




