సూర్యాపేట తనపై కేసు నమోదు చేస్తున్నారని ఆందోళనకు గురైన గిరిజన రైతు మాలోతు అనిల్(27) పోలీస్ స్టేషన్ ఎదుటే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన బుధవారం సూర్యాపేట జిల్లా నేరేడుచర్లలో చోటుచేసుకుంది
సూర్యాపేట : తనపై కేసు నమోదు చేస్తున్నారని ఆందోళనకు గురైన గిరిజన రైతు మాలోతు అనిల్(27) పోలీస్ స్టేషన్ ఎదుటే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన బుధవారం సూర్యాపేట జిల్లా నేరేడుచర్లలో చోటుచేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించి ఎస్సై రవీందర్ నాయక్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నేరేడుచర్ల మండలం బూర్గుల తండా గ్రామపంచాయతీ కి చెందిన లావూరి భారతి, మాలోతు మంగ్తి లకు పక్క పక్కనే వ్యవసాయ పొలాలు ఉన్నాయి. కాగా, ఈనెల 4 న వరం చెక్కిన విషయంలో తలెత్తిన వివాదంలో ఇరు వర్గాల నడుమ తోపులాట జరిగింది.
ఈ నేపథ్యంలో బుధవారం లావూరి భారతి ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్కు వచ్చింది. సంఘటనపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేసేందుకు కానిస్టేబుల్ పంపించామన్నారు. ఈలోగా ఇరు వర్గాల పెద్దమనుషుల మధ్య చర్చ జరుగుతుండగా గొడవ జరుగడంతో ఆందోళనకు గురై అనిల్ వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగే ప్రయత్నం చేశాడని ఎస్ఐ తెలిపారు. వెంటనే అప్రమత్తమైన హోంగార్డు వెంకటయ్య పురుగుల మందు బాటిల్ ను లాగేసుకున్నట్లు తెలిపారు. అనిల్ వెంటనే చికిత్స నిమిత్తం మిర్యాలగూడ ఏరియా హాస్పిటల్కు తరలించినట్లు ఎస్ఐ తెలిపారు.
Also read
- కంటి సమస్యలకు దివ్య పరిష్కారం! అద్భుత శక్తి గల వారాహి దేవి ఆలయం ఎక్కడుందో తెలుసా?
- భౌమ ప్రదోష వ్రతం 2026: అప్పుల బాధలు తొలగి, శివానుగ్రహం పొందేందుకు ఈరోజు ఈ పనులు తప్పక చేయండి!
- హనుమజ్జయంతి, బుద్ధ పూర్ణిమ, కాలాష్టమి సహా మే 2026లో విశిష్ట రోజులు ఇవే!
- టెంక్షన్ ఆందోళనలకు చెక్ పెట్టే శక్తివంతమైన మంత్రాలు, రోజూ జపించండి.
- అనంతపురంలో మరో వలపువల వెలుగులోకి వచ్చింది.





