బద్వేలు :కడప జిల్లా బద్వేలు పట్టణానికి చెందిన ఓ ప్రముఖ న్యాయవాది సైబరాసురుల వలలో చిక్కి, డబ్బులు పోగొట్టుకున్న విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. పట్టణానికి చెందిన న్యాయవాదికి 3 నెలల కిందట గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. తాను గుజరాత్‌కు చెందిన పోలీసు అధికారినని, మీ ఆధార్ నంబర్‌కు ఓ ఫోన్ నంబర్ లింక్ అయి ఉందని, ఆ నంబర్ ద్వారా అక్రమ కార్యకలాపాలు జరుగుతున్నందుకు క్రిమినల్ కేసు నమోదైందని న్యాయవాదిని బెదిరించాడు.
సుప్రీంకోర్టు నుంచి మీపై నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ అయిందని, అందుకు మిమ్మల్ని అరెస్టు చేయాల్సి ఉంటుందన్నాడు. దీంతో న్యాయవాది సమస్యను పరిష్కరించాలని కోరగా.. తొలుత రూ.18 లక్షలు డిపాజిట్ చేయాలని నేరగాడు నమ్మబలికాడు. అనంతరం పలుమార్లు ఫోన్ చేసి వివిధ లావాదేవీల ద్వారా మొత్తంగా రూ.72,68,039 బదిలీ చేయించుకున్నాడు.
ఈ విషయం బయటకు రాకూడదని, ఎవరికైనా చెబితే ఎనౌకౌంటర్ చేస్తామని బెదిరించాడు. తర్వాత ఇదంతా మోసమని గ్రహించిన న్యాయవాది పట్టణ పోలీసులను ఆశ్రయించగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, మోసపోయిన న్యాయవాది వివరాలను వెల్లడించడానికి పోలీసులు నిరాకరించారు
Also Read
- శ్రావణ సోమవారం: మార్కండేయుడిని మృత్యువు నుంచి కాపాడిన శివుడు.. భక్తికి ఉన్న శక్తి ఇదే!
- పాండవుల కోసం శ్రీకృష్ణుడు కోరిన ఆ 5 గ్రామాలు ఇప్పుడు ఎక్కడున్నాయి? నేటి పేర్లు ఇవే!
- Mala Japa Rules: జపమాలతో మంత్రం జపిస్తున్నారా?.. ఈ చూపుడు వేలు నియమం మీకు తెలుసా?
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- సూర్యాపేటలో రక్తం చిందించిన వేప చెట్టు





