ఎన్నికల ప్రచారాన్ని అడ్డుకుందన్న కోపంతో నిండు గర్భిణి అని కూడా చూడకుండా వైకాపా నాయకులు దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు.
కడప: ఎన్నికల ప్రచారాన్ని అడ్డుకుందన్న కోపంతో ఎనిమిది నెలల గర్భిణిపై వైకాపా నాయకులు దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు. ఈ ఘటన ఆదివారం మధ్యాహ్నం అన్నమయ్య జిల్లా ములకలచెరువు మండలంలో చోటు చేసుకుంది. ఘటనపై బాధితురాలి కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం.. తంబళ్లపల్లి వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి సతీమణి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ క్రమంలో వేపుడుకోట పంచాయతీ కోటకోళ్లపల్లెకు చెందిన మల్లికార్జున, ఆయన భార్య కల్యాణి గ్రామ సమస్యలపై ఆమెతో మాట్లాడారు. గ్రామానికి ఏం చేశారని ఓట్లు అడుగుతున్నారని ప్రశ్నించారు. దీంతో ఆగ్రహించిన వైకాపా నాయకులు కల్యాణి గర్భిణి అని కూడా చూడకుండా కాళ్లతో తన్ని విచక్షణారహితంగా దాడి చేశారు. అడ్డుకోబోయిన భర్త మల్లికార్జునను సైతం చితకబాదారు. గాయపడిన దంపతులను 108 వాహనంలో మదనపల్లి ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సమాచారం.
Also read
- పోలీస్ స్టేషన్లో కాల్పుల కలకలం.. AK-47తో కాల్చుకుని ఎస్ఐ ఆత్మహత్యాయత్నం!
- మధ్యాహ్న భోజన పథకం కార్మికుల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి….. గ్రీష్మ కుమార్, ఐ.యఫ్టియు రాష్ట్ర కమిటీ సభ్యులు.
- Ganesh Chaturthi: గణేశుడికి ఏనుగు తల ఎలా వచ్చింది? గజాసురుడి తలనే ఎందుకు పెట్టారు.. అసలు కథ ఇదే!
- భాద్రపద మాసం.. వినాయక చవితి నుంచి మహాలయ అమావాస్య వరకు.. ఈ మాసంలోని పండగలివే!
- వినాయక చవితి వేళ అద్భుత గ్రహ యోగాలు.. ఈ రాశుల వారికి గణపతి ఆశీస్సులతో పట్టిందల్లా బంగారమే!





