SGSTV NEWS online
CrimeTelangana

Diwali Poker Night: ‘దీపావళి పోకర్ నైట్’ గుట్టురట్టు: 20మంది మహిళలు అరెస్ట్!


హైదరాబాద్ నగరంలోని సంపన్నుల అడ్డా బంజారాహిల్స్‌లో టాస్క్‌ఫోర్స్ పోలీసులు నిర్వహించిన ఆకస్మిక దాడి తీవ్ర కలకలం రేపింది. దీపావళి ఫెస్టివల్ రద్దీని ఆసరాగా చేసుకుని, ఎవరికీ ఎలాంటి డౌట్ రాకుండా అత్యంత సీక్రెట్‌గా నడిపిస్తున్న ఒక హైప్రొఫైల్ పోకర్ డెన్‌ను పోలీసులు రట్టు చేశారు.

‘పోకర్ నైట్’ ముసుగులో వీఐపీ గ్యాంబ్లింగ్
‘దీపావళి పోకర్ నైట్’ పేరుతో ఏర్పాటు చేసిన ఈ స్పెషల్ ఈవెంట్‌పై పోలీసులు మెరుపుదాడి చేశారు. ఈ రైడ్‌లో ప్రముఖ బిజినెస్‌మెన్, వారి ఫ్యామిలీ మెంబర్స్‌తో సహా మొత్తం 30 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇందులో ఏకంగా 20 మందికి పైగా ప్రముఖ మహిళా వ్యాపారవేత్తలు ఉండటం ఇప్పుడు సిటీలో హాట్ టాపిక్‌గా మారింది.

బంజారాహిల్స్ పరిధిలో గరిమ గనేరివాల్ అనే బిజినెస్‌వుమన్ బయటి వ్యక్తులకు ఎంట్రీ లేకుండా ఈ ప్రైవేట్ ఈవెంట్‌ను ఆర్గనైజ్ చేశారు. లగ్జరీ వాతావరణంలో సంపన్నులు, ప్రముఖ వ్యాపార కుటుంబాలను మాత్రమే ఇన్వైట్ చేసి పెద్ద ఎత్తున ఈ పోకర్ గేమ్‌ను నడిపిస్తున్నారు. పక్కా ఇంటెలిజెన్స్ సమాచారంతో రంగంలోకి దిగిన టాస్క్‌ఫోర్స్ టీమ్స్ ఒక్కసారిగా దాడి చేసి నిర్వాహకులకు గట్టి షాక్ ఇచ్చాయి.

భారీగా లిక్కర్, పోకర్ కాయిన్స్ సీజ్
ఈ రైడ్ సందర్భంగా స్పాట్ నుంచి భారీగా అక్రమ వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పెద్ద ఎత్తున ఫారిన్ లిక్కర్ బాటిళ్లు, పోకర్ కాయిన్స్, ప్లేయింగ్ కార్డ్స్, హుక్కా పాట్స్‌తో పాటు నిందితుల మొబైల్ ఫోన్లను పోలీసులు సీజ్ చేశారు. పట్టుబడిన వారంతా సమాజంలో ప్రముఖులు, పలుకుబడి ఉన్న వ్యక్తులు కావడంతో ఈ వ్యవహారం నగరవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.


మెడికల్ టెస్ట్‌లు పూర్తి.. దర్యాప్తు ముమ్మరం
అదుపులోకి తీసుకున్న 30 మందిని నిబంధనల ప్రకారం ఉస్మానియా జనరల్ హాస్పిటల్‌కు తరలించి మెడికల్ ఎగ్జామినేషన్ పూర్తి చేశారు. అనంతరం వారిని తదుపరి విచారణ నిమిత్తం లోకల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పండుగ సంబరాల పేరుతో చట్టవిరుద్ధంగా క్యాసినో, గ్యాంబ్లింగ్ వంటి అక్రమ కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి పలుకుబడి ఉన్నవారైనా ఉపేక్షించే ప్రసక్తే లేదని పోలీస్ అధికారులు స్పష్టం చేశారు. సిటీలోని ఇలాంటి ప్రైవేట్ పార్టీలు, హైప్రొఫైల్ క్లబ్‌లపై ప్రత్యేక నిఘా ఉంచామని హెచ్చరించారు.

Also read

Related posts