ఇంజినీరింగ్ విద్యార్థిని అదృశ్యంపై తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్‌ఐ జోగారావు తెలిపారు.
కొత్తవలస, ఆగస్టు 4: ఇంజినీరింగ్ విద్యార్థిని అదృశ్యంపై తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్‌ఐ జోగారావు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ఎస్‌ఐ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని తుమ్మికాపల్లి గ్రామానికి చెందిన అప్పికొండ హర్షిణి అనే 22 ఏళ్ల ఇంజినీరింగ్ విద్యార్థిని విశాఖపట్నంలోని వెల్ఫేర్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతోంది. ప్రతిరోజూ తుమ్మికాపల్లి నుంచి ఉదయం 7 గంటలకు బయలుదేరి వెళ్లి, సాయంత్రం ఇంటికి తిరిగి వస్తుంటుంది. ఎప్పటిలాగే సోమవారం కూడా కళాశాలకు వెళ్లిన ఆమె సాయంత్రం అయినా ఇంటికి చేరలేదు. దీంతో కుటుంబీకులు తమ బంధవులను, స్నేహితులను ఆరా తీసినా ఫలితం లేకపోయింది. దీంతో విద్యార్థిని తల్లి కాంతమణి పోలీసులను ఆశ్రయించారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
Also read
- విష్ణుమూర్తి నాభి నుంచే పద్మం ఎందుకు పుట్టింది? బ్రహ్మదేవుడి ఆవిర్భావం వెనుక అసలు రహస్యం ఇదే!
- దుర్ముహూర్తం అంటే ఏమిటి? ఈ సమయంలో శుభకార్యాలు ఎందుకు చేయరు? కారణం ఇదే!
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- ప్రియుడితో వెళ్లి.. శవమై తేలిన వివాహిత.. హత్య మిస్టరీని ఛేదించిన పోలీసులు!
- Hyderabad: డబ్బు తీసుకుంది కొడుకు.. చంపింది మాత్రం తండ్రిని.. అసలు ఏం జరిగిందంటే?





