SGSTV NEWS online
Andhra PradeshCrime

అబార్షన్ చేయించుకోమన్నారు.. చివరకు రోడ్డుపై పడేశారు! అత్తింటి ముందు గర్భిణీ దీక్ష!

ఓ గర్భిణి అత్తింటి ఎదుట బైఠాయించింది.. తనకు న్యాయం చేయాలని తల్లితో కలిసి నిరసనకు దిగింది. భర్త అత్తమామలు తనకు కనికరించాలని వేడుకుంటుంది. న్యాయం కావాలంటూ ఇంటి ముందు బయట ఇచ్చిన ఆ గర్భిణీ మహిళను చూసిన వారంతా అయ్యో పాపం అనక తప్పలేదు. విశాఖపట్నం 52వ వార్డు పాత కరాసలో ఈ ఘటన చోటుచేసుకుంది.

బాధితురాలు వనజాక్షి తెలిపిన వివరాల ప్రకారం.. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ మండలం వెలగవాడకు చెందిన గోకర్ల వనజాక్షికి 2018లో విశాఖలో పాత కరాసకు చెందిన శ్రీనివాస రావు తో వివాహమైంది. వీరికి ఏడేళ్ల కొడుకు ఉన్నాడు. కొంతకాలం దాంపత్య జీవితం సజావుగా సాగింది.. అనంతరం కుటుంబ కలహాలు రావడంతో పలుమార్లు పెద్దల సమక్షంలో రాజీ కుదిరుచ్చారు. అయినప్పటికీ.. భర్త, అత్తమామల వేధింపులు కొనసాగాయని బాధితురాలు ఆరోపిస్తున్నారు.

ఈ ఏడాది ఫిబ్రవరిలో తాను గర్భం దాల్చిన తర్వాత అబార్షన్ చేయించుకోవాలని తనపై ఒత్తిడి తెచ్చారని.. దీంతో మానసికంగా కుంగిపోయి పుట్టింటికి వెళ్లిపోయానని వనజాక్షి తెలిపారు. భర్త వద్దే ఉంటున్న కుమారుడి పుట్టినరోజు సందర్భంగా అత్తింటికి వచ్చారు. దీంతో.. తాము వస్తున్నట్లు తెలుసుకొని ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారని బాధిత మహిళ ఆవేదన చెందారు. తన తల్లితో కలిసి అత్తవారింటి ఎదుట నిరసన తెలుపుతున్నానని.. భర్త అత్తమామల వేధింపులు ఆపి.. తనకు న్యాయం చేయాలని కోరారు. గర్భిణి అయిన మహిళ.. తన భర్త అత్తమామల వేధింపులతో నిరసన తెలపడం అందరిని కలచి వేసింది.

Also read

Related posts