పుత్తూరులో కలకలం రేపిన ఘటన
పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్న పోలీసులు
పుత్తూరు: తిరుపతి జిల్లా పుత్తూరు పట్టణం కృష్ణానగర్ 3వ వీధిలో శనివారం రాత్రి ఇద్దరు పిల్లలతో తల్లి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి డీఎస్పీ జి.రవికుమార్ తెలిపిన వివరాలు.. కృష్ణానగర్‌లో నివసిస్తున్న శివశంకర్, పద్మజ (27) ఒకే కళాశాలలో డిగ్రీ చదువుతూ ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి తేజశ్రీ (7), లాస్య (4) ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రైవేటు పాఠశాలలో తేజశ్రీ 2వ తరగతి, లాస్య యూకేజీ చదువుతోంది. శివశంకర్ నిరుద్యోగి కావడంతో శనివారం ఉదయం శ్రీసిటీ లో ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వెళ్లాడు.
అయితే పిల్లలను విడిచిపెట్టామని మధ్యాహ్నం 2.30 గంటలకు పాఠశాల నుంచి శివశంకర్‌కు ఫోన్ వచ్చింది. నేను ఇంటర్వ్యూలో ఉన్నానని తెలిసిన వారికి పిల్లలను తీసుకెళ్లాలని చెప్పాడు. వారు తీసుకువస్తుండగా మార్గమధ్యంలో ఎదురుగా వచ్చిన పద్మ జ పిల్లలను తీసుకెళ్లింది. అయితే సాయంత్రం ఇంటికి చేరుకున్న శివశంకర్ తలుపు కొట్టినా ఎంతకూ తీయకపోవడంతో కిటికిలోనుంచి చూడగా అమ్మాయి వేలాడుతూ కనిపించింది.
దీంతో ఇరుగుపొరుగువారిని తీసుకువచ్చి తలుపు పగలగొట్టి లోపలకు వెళ్లగా తల్లీ కుమార్తెలు విగత జీవులుగా వేలాడుతూ కనిపించారు. వారు అందించిన సమాచా రం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నా రు. పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. కాగా, శివశంకర్‌ను పెళ్లి చేసుకున్న పాపానికి తాను ఎన్నో కష్టాలపాలయ్యానని, ఊరంతా అప్పులే ఉన్నాయని.. పద్మజ సూసైడ్ లేఖలో పేర్కొంది.
Also read
- అయ్యో ఎంత పని చేశావ్ తల్లి.. ఉరివేసుకొని 5వ తరగతి బాలిక ఆత్మహత్య.. ఎందుకంటే?
- అయ్యో అనిత.. మరికాసేపట్లో డెలివరీ.. అంతలోనే వైద్యులు వచ్చి ఏం చెప్పారంటే..
- ఎంతకు తెగించార్రా..! రూ.30 వేల అప్పు కోసం 21 రోజుల పసికందు కిడ్నాప్..!
- Hyderabad: అంతా పక్కా స్కెచ్.. బెడిసికొట్టిన ఫ్లాన్.. ఏటీఎం చోరీ కేసులో సంచలన ట్విస్ట్!
- అనారోగ్యంతో ఆస్పత్రికి వెళ్తే.. నువ్వు చనిపోయావ్‌గా అన్నారు.. అసలు ఏమైందంటే..?





