పెద్దవడుగూరు, : ఒకటి, రెండు కాదు.. ఐదు పెళ్లిళ్లు చేసుకుని మోసాలకు పాల్పడిన నిత్య పెళ్లికూతురు వజ్రపు మణి ఎలియాస్ శ్వేతారెడ్డి ఎలియాస్ కీర్తి(27)ని శుక్రవారం అరెస్టు చేసినట్లు పెద్దవడుగూరు పోలీసులు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం దొండపూడికి చెందిన వజ్రపు పాండు కుమార్తె మణి. ఈమె విజయవాడకు చెందిన మధ్యవర్తులు సుమప్రియ, అశోక్, శశికళ, రామకృష్ణ ద్వారా వివాహాలు కుదుర్చుకునేది. ఇలాగే అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం కాశేపల్లికి చెందిన యాపర్ల సుధీర్రెడ్డికి పరిచయమైంది. 2025లో ఆయన ఆమెకు రూ.3.8 లక్షల ఎదురుకట్నం ఇచ్చి పెళ్లి చేసుకున్నారు. ఈ మొత్తంలో మధ్యవర్తులు నిందితురాలికి రూ.20-30 వేలే ఇచ్చేవారు.
సుధీర్రెడ్డి ఇంట్లో మూడు రోజులున్న నిందితురాలు దాంపత్య జీవితం ప్రారంభించకుండానే ఒంట్లో బాగోలేదని, పుట్టింటికి వెళ్లాలని కోరింది. సుధీర్రెడ్డి, ఆమె కలిసి రైలులో ఊరికి బయలుదేరారు. నంద్యాల వద్దకు చేరగానే నిందితురాలు రైలు దిగి మాయమైంది. సుధీర్రెడ్డి రైల్వేస్టేషన్ మొత్తం గాలించి కనపడకపోవడంతో మోసపోయినట్లు గుర్తించారు. తనకు పెళ్లి చేసిన మధ్యవర్తులతో మాట్లాడేందుకు యత్నించగా ఫోన్లు స్విచాఫ్ వచ్చాయి. మణి గురించి వాకబు చేయగా, ఐదుగురిని పెళ్లిచేసుకొని మోసం చేసిందని, ఆమెకు కుమారుడు, కుమార్తె ఉన్నారని తేలింది. బాధితుడు 2025లోనే పెద్దవడుగూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అప్పటినుంచి పోలీసులు గాలించసాగారు. నిందితురాలు కర్ణాటకలోని మల్లెకుప్ప గ్రామానికి చెందిన ఒక వ్యక్తిని పెళ్లి చేసుకున్నట్లు తెలుసుకున్నారు.
మల్లెకుప్ప నుంచి మదనపల్లెకు వస్తున్నట్లు సమాచారం అందుకున్న ఎస్సై ఆంజనేయులు తన సిబ్బందితో వెళ్లి అరెస్టు చేశారు. నిందితురాలితో పాటు మధ్యవర్తులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వివరించారు.
Also read
- చుట్టాలే కదాని గుడ్డిగా నమ్మి రూ.21 లక్షలు ఇచ్చింది.. తీరా తిరిగిమ్మని అడ్డగ్గా.. ఇది పరిస్థితి
- బట్టతల, తిప్పి కొడితే 5 అడుగులు.. 40 మంది మహిళల్ని ఎలా మోసం చేశావురా..
- ఐదు వివాహాలతో బురిడీ.. నిత్య పెళ్లికూతురు అరెస్టు
- ఖైదీలా బతికా.. అందుకే కడతేర్చా పోలీస్ విచారణలో శ్వేత…
- అనారోగ్యం కారణంగానే..





