మద్యం కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు, అలానే పక్కవారి ప్రాణాలు కూడా తీస్తున్నారు. తాజాగా మద్యం తాగిన మత్తులో ఏం చేస్తున్నానో అనే సోయి లేకుండా ఓ యువకుడు పెట్రోల్ తాగేశాడు. అనంతరం తీవ్ర అస్వస్థతకు గురవ్వడంతో గమనించిన కుటుంబ సభ్యులు అతన్ని హాస్పిటల్‌కు తరించగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.
మద్యం మత్తులో పెట్రోల్ తాగడంతో తీవ్ర అస్వస్థతతకు గురై యువకుడు మరణించిన ఘటన సిద్దిపేట జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పెద్ద చీకోడ్ గ్రామానికి చెందిన ఎండీ ఫయాజ్ అనే యువకుడు గత కొన్ని రోజులుగా మద్యానికి బానిసయ్యాడు. నిత్యం మందు తాగి ఇంటికి వచ్చేవాడు. రోజూలానే నిన్న కూడా ఫుల్‌గా తాగిన ఫయాజ్ మత్తులో లచ్చపేట జడ్పీహెచ్ఎస్ పాఠశాల వెనుక తన ద్విచక్ర వాహనంలోని పెట్రోల్‌ను తీసుకొని తాగేశాడు.
పెట్రోల్ తాగిన కాసేపటికే ఫయాజ్ అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. అది గమనించిన స్థానికలు అతని స్నేహితుడికి సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్న స్నేహితుడు, కుటుంబ సభ్యులు ఫయాజ్ను తొలుత దుబ్బాకలోని హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ అతనికి చికిత్స అందించిన వైద్యులు మెరుగైన చికిత్స నిమిత్తం సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
అక్కడికి వెళ్లాక పరిస్థితి మరింత విషమించడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ మృత్యువుతో పోరాడుతూ ఫయాజ్ గురువారం అర్ధరాత్రి కన్నుమూశాడు. చేతికి అందొచ్చిన కొడుకు ఇలా వ్యసనానికి బలై పోవడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Also read
- నేటి జాతకములు 26 సెప్టెంబర్, 2026
- అన్నను స్కూల్ బస్సు ఎక్కించేందుకు తల్లి వెంటే వచ్చి.. అదే బస్సు కిందపడి మూడేళ్ల బాలుడు మృతి!
- వేడి సాంబార్లో పడి మహిళ మృతి.. సీసీ కెమెరాలో షాకింగ్ దృశ్యాలు!
- విష్ణుమూర్తి నాభి నుంచే పద్మం ఎందుకు పుట్టింది? బ్రహ్మదేవుడి ఆవిర్భావం వెనుక అసలు రహస్యం ఇదే!
- దుర్ముహూర్తం అంటే ఏమిటి? ఈ సమయంలో శుభకార్యాలు ఎందుకు చేయరు? కారణం ఇదే!





