బెంగళూరు (కృష్ణరాజపురం), : తల్లిదండ్రులు, చెల్లెలిని హత్య చేసి అరెస్టయిన నిందితురాలు శ్వేత (25) విచారణ కృష్ణరాజపురం రాణా పోలీసుల ఆధ్వర్యంలో జోరందుకుంది. పాండిచ్చేరిలో ఆమెను అరెస్టు చేసిన పోలీసులు, నగరానికి తీసుకువచ్చి 47వ ఏసీజేఎం న్యాయస్థానం ముందు హాజరు పరిచారు. వారం పాటు పోలీసుల విచారణకు న్యాయమూర్తి అనుమతించారు. శ్వేతతో సహజీవనం చేస్తున్న కెనెత్ పుదుచ్చేరిలోని అణ్ణాసాలై సమీపంలో ఉన్నట్లు గుర్తించి ఓర్లియన్ పేట ఠాణా పోలీసుల సహకారంతో అతన్ని బంధించామని నగర పోలీసు కమిషనర్ సీమంత్ కుమార్్సంగ్ స్పష్టం చేశారు.
తాను స్వతంత్రంగా ఉండేందుకు తల్లి అనుమతించలేదని, అందరూ ఉన్నా తాను ఖైదీలాగా, అనాథలా బతికానని ఆమె ఆక్రోశించిందని పోలీసులు తెలిపారు.
పాఠశాలలో చేరినప్పటి నుంచి ఇంజినీరింగ్ పూర్తయ్యే వరకు తాను ఖైదీలా బతికానని శ్వేత చెప్పింది. తనకు ఆస్తిలో వాటా ఇవ్వాలని కోరగా తండ్రి సోమసుందర్, తల్లి ముత్తులక్ష్మి, సోదరి సుప్రియతో గొడవ జరిగిందని, తానే కత్తి తీసుకుని పొడిచానని అంగీకరించిందని పోలీసులు వివరించారు. హత్య చేయాలనే తలంపుతోనే.. వారిని భోజనానికి రావాలని తన ప్లాట్‌కు తానే ఆహ్వానించానని చెప్పింది. ప్రేమికుడు కెనెత్‌కు ఈ హత్యలతో సంబంధం లేదని తెలిపింది.
శ్వేత తండ్రి సోమసుందరాన్ని చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకువెళుతున్న సమయంలో కుమార్తె, కెనెత్ ఇద్దరూ కలిసి తమపై కత్తులతో దాడి చేశారని చెప్పడంతో అతనిపైనా కృష్ణరాజపురం ఠాణాలో హత్య కేసు నమోదైంది. సోమసుందరం (55), ఆయన భార్య ముత్తులక్ష్మి (48), వారి కుమార్తె సుప్రియ (20)పై సీగేహళ్లిలోని ఒక అపార్ట్మెంట్ ప్లాట్‌లో గత సోమవారం రాత్రి జరిగిన దాడిలో మరణించిన విషయం తెలిసిందే.
Also read
- చుట్టాలే కదాని గుడ్డిగా నమ్మి రూ.21 లక్షలు ఇచ్చింది.. తీరా తిరిగిమ్మని అడ్డగ్గా.. ఇది పరిస్థితి
- బట్టతల, తిప్పి కొడితే 5 అడుగులు.. 40 మంది మహిళల్ని ఎలా మోసం చేశావురా..
- ఐదు వివాహాలతో బురిడీ.. నిత్య పెళ్లికూతురు అరెస్టు
- ఐదు వివాహాలతో బురిడీ.. నిత్య పెళ్లికూతురు అరెస్టు
- ఖైదీలా బతికా.. అందుకే కడతేర్చా పోలీస్ విచారణలో శ్వేత…




