రాజమహేంద్రవరం: తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం విషాదం చోటుచేసుకుంది. గోదావరి నదిలో మునిగి బావబావమరిది మృతి చెందారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
రాజమహేంద్రవరంలోని యాదమ్మ దిబ్బకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు దేవర శ్రీనివాస్, అనకాపల్లి జిల్లా సైపవరానికి చెందిన ఈపు నూకరాజు బావబావమరుదులు. సోమవారం వీరిద్దరూ పుష్కరఘాట్ వద్ద నదిలో స్నానం చేసేందుకు వెళ్లారు. లోతు గమనించక నదిలో దిగడంతో ప్రవాహంలో కొట్టుకుపోయి మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని మృతదేహాలను వెలికితీశారు. కేసు నమోదు చేసుకొని మృతదేహాలను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నూకరాజుకు కొన్ని రోజుల కిందటే వివాహమైందని బంధువులు తెలిపారు. నదీతీరంలో ఆహ్లాదంగా గడిపేందుకు వచ్చి బావబావమరుదులు మృతి చెందడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
Also read
- కొనసాగుతున్న దళితులపై దాడుల పరంపర….ఐ.యఫ్.టి.యు
- బస్టాండ్ లో దారుణం.. ప్రేమ నిరాకరించిందని బంధువు దాడి!
- కన్న కొడుకును గొడ్డలితో నరికి చంపిన తల్లి.. ఎందుకో తెలుసా..?
- Hyderabad: ఓల్డ్‌సిటీ ప్రైవేట్ స్కూల్లో కలకలం.. కల్మా చదవాలని హిందూ విద్యార్థికి హోమ్ వర్క్..
- బాలికపై ముగ్గురు ఆటో డైవర్ల పైశాచికం! ప్రేమ పేరుతో ఒకడు, వీడియోలు ఉన్నాయంటూ ఇద్దరు..





