తన తల్లిదండ్రులకు ప్రాణహాని ఉందంటూ పశ్చిమగోదావరి జిల్లా ఉన్నతాధికారులను ప్రముఖ సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్ ఆశ్రయించారు.
భీమవరం, మే 25: తన తల్లిదండ్రులకు ప్రాణహాని ఉందంటూ పశ్చిమగోదావరి జిల్లా ఉన్నతాధికారులను ప్రముఖ సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్ ఆశ్రయించారు. సోమవారం పశ్చిమగోదావరి జిల్లా ముఖ్య కేంద్రం భీమవరం కలెక్టరేట్‌లోని పీజీఆర్ఎస్‌లో అనంత శ్రీరామ్ ఈ ఫిర్యాదు చేశారు. పాలకొల్లు సమీపంలోని యలమంచిలి మండలం దొడ్డిపట్లలో తమ ఇంటి ముందున్న ఐదు సెంట్ల ఉమ్మడి స్థలాన్ని ఆక్రమించారంటూ ఆయన తన ఫిర్యాదులో స్పష్టం చేశారు. ఈ స్థల వివాదం ప్రస్తుతం కోర్టులో ఉందని గుర్తు చేశారు.
ఈ స్థలం కోసం మాజీ ఎంపీ హరి రామజోగయ్య కుమారుడు సూర్యప్రకాశ్ తన తల్లిదండ్రులను బెదిరింపులకు గురి చేస్తూ.. వారిని మానసికంగా హింసకు గురి చేస్తున్నాడని ఆ ఫిర్యాదులో అనంత శ్రీరామ్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తన తల్లిదండ్రులకు ప్రాణహాని ఉందని జిల్లా కలెక్టర్‌తోపాటు ఎస్పీకి అనంత శ్రీరామ్ ఫిర్యాదు చేశారు. వారికి రక్షణ కల్పించాలని ఉన్నతాధికారులను అనంత శ్రీరామ్ కోరారు.
Also read
- దేవి నవరాత్రులు మొదలు దీపావళి వరకు- ఆశ్వయుజ మాసంలో వచ్చే పండుగలు, పుణ్య తిథులు ఇవే!
- నవరాత్రుల్లో అదృష్టం.. ఈ రాశి వారు కోరుకున్న కోరిక నెరవేరుతుంది
- Garuda Purana: అప్పు తీర్చకుండా మరణిస్తే ఏమవుతుంది? గరుడ పురాణం ఏం చెబుతోంది?
- Parivartan Yoga: పరివర్తన యోగం.. అదృష్టాలు పట్టబోయే రాశులివే..!
- మహాలయ అమావాస్య నాడు పితృదేవతలను ఎందుకు పూజించాలి? గోత్రం తెలియకపోతే ఏం చేయాలి?





