సహజీవనం చేస్తున్న ఓ వ్యక్తికి ఆటో కొనిచ్చేందుకు ఓ మహిళ తన ఐదేళ్ల కొడుకును రూ. 50 వేలకు అమ్మేసిన ఘటన కామారెడ్డిలో చోటుచేసుకుంది. అయితే ఆ బాలుడిని కొన్న మహిళ రూ. లక్షకు మరో వ్యక్తికి అమ్మేసింది. దీంతో పోలీసులకు విషయం తెలియడంతో ఐదుగురిపై కేసు నమోదు చేశారు
సహజీవనం చేస్తున్న ఓ వ్యక్తికి ఆటో కొనిచ్చేందుకు ఓ మహిళ తన ఐదేళ్ల కొడుకును రూ. 50 వేలకు అమ్మేసిన ఘటన కామారెడ్డిలో చోటుచేసుకుంది. అయితే ఆ బాలుడిని కొన్న మహిళ రూ. లక్షకు మరోవ్యక్తికి అమ్మేసింది. ఈ విషయం చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్లకు, పోలీసులకు తెలియడంతో ఐదుగురిపై కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన బూస లావణ్యకు ఐదేళ్ల కింద నర్సింలు అనే వ్యక్తితో వివాహం కాగా వీరికి ఓ పాప, బాబు ఉన్నారు. అయితే నర్సింలు అనారోగ్యం కారణంగా చనిపోయాడు. దీంతో లావణ్య ఓ బట్టల షాపులో పనిచేస్తూ పిల్లలను పోషిస్తోంది. మరో వైపు లింగంపేట మండలం పర్కల్ల గ్రామానికి చెందిన సాయిలు తన భార్యతో గొడవ పడి ఇంట్లో నుంచి వెళ్లిపోయి కామారెడ్డిలో ఉంటున్నాడు.
ఈ క్రమంలో లావణ్యకు సాయిలుతో పరిచయం ఏర్పడగా అది అక్రమ సంబంధానికి దారి తీసింది. ఇద్దరూ సహజీవనం చేస్తున్నారు. అయితే జీవనోపాధి కోసం ఆటోకొనేందుకు బాలుడిని అమ్మేయాలని సాయిలు లావణ్యను కోరాడు. ఇందుకుఒప్పుకున్నలావణ్య తన కుమారుడు నిఖిల్ ను ఇటీవల పర్మల్ల గ్రామానికి చెందిన నసీమా అనే మహిళకు రూ.50 వేలకు అమ్మేసింది. తిరిగి నసీమా మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం రాజీపేటలోని తన సోదరి షాహిదాకు అమ్మగా.. ఆమె ఆదే గ్రామానికి చెందిన కుంచాల శేఖర్ అనే వ్యక్తికి రూ. లక్షకు బాలుడిని విక్రయించింది. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు బాలుడిని బాలల సంరక్షణ కేంద్రానికి తరలించారు. బాలుడి తల్లి లావణ్యతో పాటు సాయిలు, నసీమా, షాహిదా, కుంచాల శేఖర్ లపై కేసు నమోదు చేశారు.
Also Read
- పోలీస్ స్టేషన్లో కాల్పుల కలకలం.. AK-47తో కాల్చుకుని ఎస్ఐ ఆత్మహత్యాయత్నం!
- మధ్యాహ్న భోజన పథకం కార్మికుల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి….. గ్రీష్మ కుమార్, ఐ.యఫ్టియు రాష్ట్ర కమిటీ సభ్యులు.
- Ganesh Chaturthi: గణేశుడికి ఏనుగు తల ఎలా వచ్చింది? గజాసురుడి తలనే ఎందుకు పెట్టారు.. అసలు కథ ఇదే!
- భాద్రపద మాసం.. వినాయక చవితి నుంచి మహాలయ అమావాస్య వరకు.. ఈ మాసంలోని పండగలివే!
- వినాయక చవితి వేళ అద్భుత గ్రహ యోగాలు.. ఈ రాశుల వారికి గణపతి ఆశీస్సులతో పట్టిందల్లా బంగారమే!





