జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. భర్త చనిపోయిన రెండు గంటల్లోనే భార్య మృతిచెందడం ఆ కుటుంబంలో విషాదం నింపింది. పొలం దగ్గర పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు మంటలంటుకొని భర్త మృతిచెందగా జీవిత భాగస్వామి మరణవార్త భార్య గుండెపోటుతో కుప్పకూలిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రేపాకపల్లిలో జరిగింది. ఒకేరోజు గంటల వ్యవధిలో దంపతులిద్దరు చనిపోవడం రేపాకపల్లిలో విషాదఛాయలు అలముకొన్నాయి.
శనివారం (మే23) సాయంత్రం 4గంటలకు రేపాకపల్లికి చెందిన చాగర్ల చంద్రమౌళి (62) పొలం దగ్గర పనిచేస్తుండగా అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. గడ్డి కట్టలకు మంటల వ్యాపించగా మంటలార్పే క్రమంలో చంద్రమౌళికి నిప్పంటుకుంది. దీంతో చంద్రమౌళి అక్కడికక్కడే మృతిచెందాడు. భర్త మరణవార్త విన్న చంద్రమౌళి భార్య భాగ్యం(55) గుండెపోటుతో కుప్పకూలింది. హుటాహుటిన ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమాధ్యలో చనిపోయింది. భార్యభర్తలు అకస్మాత్తుగా కొన్ని గంటల వ్యవధిలోనే చనిపోవడంతో ఆకుటుంబంతోపాటు రేపాకపల్లిలో తీవ్ర విషాదంలో నెలకొంది.
Also read
- బేగంపేట్ లో నకిలీ ఎయిర్ ఫోర్స్ అధికారి హల్ చల్.. ఎట్టకేలకు పోలీసులకు చిక్కిన నిందితుడు..
- భార్యను కాపురానికి పంపకపోతే మనవరాలి మార్ఫ్ద్ న్యూడ్ ఫోటోలు వైరల్.. అత్తను బెదిరించిన అల్లుడు!
- Srikakulam: అద్దెకు ఇల్లు కావాలంటూ వచ్చిన మహిళ.. ఏం చేసిందో తెలిస్తే షాకే..
- కాపురానికి రాని భార్య.. తీవ్ర మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య.. మనోహరాబాద్లో విషాదం!
- సరదాగా మొదలైన అలవాటు మెడకు చుట్టేసుకుంది.. ఈ యువకుడి జీవితంలో ఏం జరిగిందంటే..?





