బెంగళూరు: ఒకే ఆస్పత్రిలో పని చేస్తున్న డాక్టర్, నర్స్ రెండు రోజుల తేడాలో ఆత్మహత్యకు పాల్పడ్డ సంఘటన కనకపుర పట్టణంలోని మహదేశ్వర కాలనీలో చోటు చేసుకుంది. స్థానిక నవోదయ ఆస్పత్రిలో వైద్యుడిగా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ చేతన్ కుటుంబ కలహాల నేపథ్యంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఇదే ఆస్పత్రిలో నర్స్‌గా పని చేస్తున్న సరస్వతి(45) గురువారం రాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇద్దరూ ఈ ఆస్పత్రిలో చాలా ఏళ్లుగా పని చేస్తున్నారు. డాక్టర్ మృతిని తట్టుకోలేక సరస్వతి మనోవేదనకు గురై తానూ ఆత్మహత్య చేసుకుందన్న అనుమానం వ్యక్తమవుతోంది. ఘటనపై కనకపుర పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
Also read
- అరటి మొక్కకు ఇంత పవిత్రత ఎందుకు? పూజల్లో ఎందుకు తప్పనిసరిగా పెడతారో తెలుసా?
- October 2026 Horoscope: ఈ రాశులకు అక్టోబర్‌లో ఆర్థికం, కెరీర్లో భారీ శుభవార్తలు! మీ రాశికి ఇలా..
- కళ్లముందే కారులో మంటలు.. తండ్రి సజీవ దహనం! కుమారుడిని ఎలా కాపాడారంటే?
- నేటి జాతకములు 26 సెప్టెంబర్, 2026
- అన్నను స్కూల్ బస్సు ఎక్కించేందుకు తల్లి వెంటే వచ్చి.. అదే బస్సు కిందపడి మూడేళ్ల బాలుడు మృతి!





