పిఠాపురం, , రెండు రోజుల్లో కుమార్తె వివాహం జరగనుండగా.. బుధవారం తండ్రి కావాటి చిన్నఏసు (45) అనుమానాస్పద స్థితిలో మృతిచెందడంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఎస్సై లోకేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఉదయం స్థానికులు పిఠాపురం ఉప్పాడ బస్టాండ్ సెంటర్ లోని డ్రెయినేజీలో మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్సై సంఘటన ప్రాంతానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీయించారు. జగ్గయ్యచెరువు ప్రాంతానికి చెందిన చిన్నఏసుగా గుర్తించారు. మద్యం తాగి కాలువలో పడినట్లు సందేహం వ్యక్తం చేస్తున్నారు. మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్త చేస్తున్నారు. చిన్నఏసుకు అయిదుగురు కుమార్తెలుండగా 8న రెండో కుమార్తె వివాహం ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. పెళ్లి ఇంట విషాదం అలముకోవడంతో బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Also read
- అన్నను స్కూల్ బస్సు ఎక్కించేందుకు తల్లి వెంటే వచ్చి.. అదే బస్సు కిందపడి మూడేళ్ల బాలుడు మృతి!
- వేడి సాంబార్లో పడి మహిళ మృతి.. సీసీ కెమెరాలో షాకింగ్ దృశ్యాలు!
- విష్ణుమూర్తి నాభి నుంచే పద్మం ఎందుకు పుట్టింది? బ్రహ్మదేవుడి ఆవిర్భావం వెనుక అసలు రహస్యం ఇదే!
- దుర్ముహూర్తం అంటే ఏమిటి? ఈ సమయంలో శుభకార్యాలు ఎందుకు చేయరు? కారణం ఇదే!
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?





