SGSTV NEWS online
Andhra PradeshCrime

ఇంటికి రా.. ఐ వాంట్‌ యూ !.. విద్యార్థినికి ప్రొఫెసర్‌ ఆడియో మెసేజ్ వైరల్!!


మాత, పిత, గురు, దైవం.. తల్లిదండ్రుల తర్వాత అంతటి ఉన్నత స్థానాన్ని ఇచ్చేది గురువులకే. కానీ విద్యార్థులకు మంచి విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువు… అదే బాధ్యతను మరిచి తప్పుగా ప్రవర్తించిన ఘటన శ్రీకాకుళం అంబేద్కర్ యూనివర్సిటీలో వెలుగుచూసింది. కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా కానీ పనిచేస్తున్న ఒక వ్యక్తి, ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

కాగా “నువ్వంటే ఇష్టం.. ఐ వాంట్‌ యూ” అంటూ సదరు ప్రొఫెసర్ విద్యార్థినితో చేసిన అసభ్యకర సంభాషణకు సంబంధించిన ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ ఆడియోలో.. రేపు సెలవు కదా.. ఇంటికి రా… ఇంకా ఎనిమిది సెమిస్టర్లు ఉంటావు.. వస్తే నీ ఇష్టం.. కలిసి ప్రయాణం చేద్దాం అని ఆహ్వానించాడు. అంతటితో ఆగకుండా “టైం వేస్ట్ చేయకుండా ఫేస్ టూ ఫేస్ చెప్తాను.. ఐ వాంట్‌ యూ. మన ప్రయాణంలో ఎలా ఉండాలి, ఏమిటనేది షేర్ చేసుకుందాం.. అది పర్సనల్ అయినా ప్రొఫెషనల్ అయినా” అంటూ విద్యార్థినిపై ఒత్తిడి తెచ్చాడు.

అలానే “ఎన్ని గంటలకు వస్తావో చెబితే శ్రీకాకుళం కాంప్లెక్స్ దగ్గరకు వచ్చి రిసీవ్ చేసుకుంటాను.. మా ఇంటికి వచ్చాక నీ ఇష్టం.. నన్ను సర్, సర్ అని పిలవొద్దు. అండి అని పిలువు” అని కామంతో కళ్లు మూసుకుపోయి మాట్లాడాడు. ఈ వేధింపులపై బాధితురాలు వెంటనే యూనివర్సిటీ అధికారులకు ఫిర్యాదు చేసి, తన వద్ద ఉన్న ఆడియో క్లిప్‌ను ఆధారంగా సమర్పించింది. అయితే విషయం బయటకు పొక్కితే విశ్వవిద్యాలయ ప్రతిష్ఠకు భంగం వాటిల్లుతుందని భావించిన అధికారులు, ఇరువురి మధ్య రాజీ కుదిర్చినట్లు సమాచారం.

ఈ రాజీ సందర్భంలోనే ఆ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ “నువ్వు ఎలా పాస్ అవుతావో చూస్తా” అని విద్యార్థినిని బెదిరించినట్టు వాపోతున్నారు. ఇక ఘటన సర్వత్రా చర్చనీయాంశంగా మారడంతో.. యూనివర్సిటీ అధికారులు స్పందించి విచారణ ప్రారంభించినట్టు తెలుస్తోంది. ఆరోపణలు నిజమైతే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మహిళా భద్రత కోసం ఉన్న కమిటీ కూడా ఈ కేసును పరిశీలిస్తోంది. ఈ విషయంపై విద్యార్థులు, మహిళా సంఘాలు తీవ్రంగా స్పందించాయి. వెంటనే అతనిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Also read

Related posts