కొడుకుతో కలిసి.. ప్రియుడిని హతమార్చిన మహిళ
జీడిమెట్ల: కొడుకుతో కలిసి, ఓ మహిళ తన ప్రియుడిని హతమార్చింది. ఈ ఘటనహైదరాబాద్ జీడిమెట్ల ఠాణా పరిధిలోని చింతల్ అంబేడ్కర్‌నగర్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఏపీలోని అన్నమయ్య జిల్లాకు చెందిన శివారెడ్డి (40)తో కలిసి గత పదేళ్లుగా ఓ మహిళ సహజీవనం చేస్తోంది. 19 ఏళ్ల తన కుమారుడు కూడా వాళ్లతోనే ఉంటున్నాడు. వారిద్దరినీ గత కొన్నాళ్లుగా శివారెడ్డి వేధిస్తుండేవాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి తల్లీ కొడుకులు మటన్ కొట్టే కత్తితో నరికి అతడిని హత్య చేశారు. శవాన్ని ఓ సంచిలో మూటగట్టి తరలించే ప్రయత్నం చేయగా.. ఈ సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
Also read
- Garuda Puran: భర్త భార్యను- భార్య భర్తను హింసిస్తే గరుడ పురాణం ప్రకారం శిక్షేంటో తెలుసా!
- Seven Spiritual Cities: జీవితకాలంలో ఈ ఏడు క్షేత్రాలను ఒక్కసారైనా దర్శించుకుంటే.. స్వర్గలోకంలోకి ఎంట్రీ ఖాయమట
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- రైతులను ఏడిపించిన కాపర్ గ్యాంగ్.. పట్టుకుని వీధుల గుండా భలే మర్యాద చేసిన పోలీసులు!
- అర్ధరాత్రి వదిన లేదని తెలిసి ఇంట్లోకి చొరబడ్డ మరదలు! సీన్ కట్ చేస్తే.. ఊహించని షాక్





