ఇబ్రహీంపట్నం, : ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకోవడానికి ధాన్యం కొనుగోలు కేంద్రం వద్దకు వచ్చిన రైతు వడదెబ్బకు గురై ధాన్యం కుప్పపైనే ప్రాణాలు వదిలారు. ఈ హృదయవిదారక ఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం రాయపోల్‌లో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గౌరయ్య(60) అర ఎకరం సొంత పొలంతో పాటు మరికొంత కౌలుకు తీసుకుని వరి సాగు చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రానికి మూడు రోజుల కిందట వడ్లను తీసుకొచ్చారు. అక్కడే రోజూ ఆరబెడుతున్నారు. ఆదివారం సాయంత్రం వర్షం వస్తుందేమోనని ఆరబెట్టిన వడ్లను కుప్పగా చేస్తుండగా వడదెబ్బకు గురై మృతి చెందారు. ఆయనకు భార్య వెంకటమ్మ, ఇద్దరు కుమారులు ఉన్నారు. గౌరయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని భారాస జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు.
Also read
- బ్రహ్మపుత్ర నదిలో పడి జమ్మలమడుగు యువతి మృతి
- కళ్లల్లో కారం చల్లి… కత్తులతో నరికి… RMP డాక్టర్ హత్య కేసులో షాకింగ్ ట్విస్ట్..!
- Video: రీల్స్‌తో వివాదం.. రాజీనామా చేసిన ప్రభుత్వ టీచర్! కన్నీళ్లు పెట్టుకుంటూ..
- ఇంకా దొరకని రాము.. నీతు.. గుండెల్ని పిండేస్తున్న ఘటన..
- Massive Scam: 70 మందికి టోకరా పెట్టిన రిటైర్డ్ టీచర్.. ఏకంగా ఏడు కోట్లు స్వాహా





