*గత వైసిపి ప్రభుత్వం లో బ్రాహ్మణ క్రెడిట్ సొసైటీలో జరిగిన అవినీతి, అక్రమాలపై ఐఏఎస్ తో కమిటీ వేసి ఆడిట్ చేయించాలి…* శిరిపురపు శ్రీధర్
అమరావతి:
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మరియు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లుగా *తెదేపా సీనియర్ నేత, మాజీ బ్రాహ్మణ కార్పొరేషన్ కో-ఆర్డినేటర్, బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మ ఏర్పాటు చేసిన సమావేశంలో* కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా భారతదేశం మొత్తంలో తొలిసారి పేద బ్రాహ్మణుల సంక్షేమం కోసం 2015లో బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి అనుబంధంగా బ్రాహ్మణ కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ప్రభుత్వ బ్రాహ్మణ కుల భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన సొసైటీలో కోపరేటివ్ సొసైటీ శాఖ నుంచి ఈ సొసైటీకి సీఈవోగా నాగ సాయి అనే వ్యక్తి 2017లో నియామకం జరిగినది. అప్పటి నుంచి 2026 నేటివరకు ఒకే చోట ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ రెండు జీతాలు తీసుకుంటూ 9 సంవత్సరాల పాటు బ్రాహ్మణ కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీలో పేద, ఉన్నత వర్గాల బ్రాహ్మణులు దాచుకున్న సొమ్మును గత వైసిపి జగన్ ప్రభుత్వంలో పందికొక్కు లాగా దోచుకున్నాడని భారీ స్థాయిలో అవినీతి చేశాడని, సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగి ఎక్కడైనా మూడు సంవత్సరాల పాటే ప్రభుత్వ నిబంధనల ప్రకారం పని చేయాల్సి ఉంటుందని తర్వాత ట్రాన్స్ఫర్ జరుగుతుందని కానీ ఈ సీఈవో గత వైసిపి ప్రభుత్వ పార్టీ నేతల్ని కూడా ప్రలోభాలకు గురిచేసి ఇన్నేళ్లపాటు ఒకే చోట ఉద్యోగం చేసి రెండు జీతాలు తీసుకోవడం జరిగిందని, అవినీతి అక్రమాలపై ఎన్నో ఫిర్యాదులు తాము చేస్తున్నామని, కూటమి ప్రభుత్వం ఏర్పడిన నుండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి, బీసీ వెల్ఫేర్ శాఖ మాత్యులు సవిత కు కూడా వ్రాతపూర్వక ఫిర్యాదులు అందజేయటం జరిగిందని శ్రీధర్ తెలియజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వంలో సంబంధిత అధికారులు దీనిపైన విచారణ చేసి తక్షణమే నాగసాయిని బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ సీఈవో బాధ్యతల నుంచి తొలగించడం జరిగిందని దీనిపైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న బ్రాహ్మణ సమాజం, బ్రాహ్మణ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నట్లు శ్రీధర్ తెలియజేశారు. సీఈవో నాగసాయి బ్రాహ్మణ కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీలో చేసిన అవినీతిపై ఐఏఎస్ తో కమిటి వేసి ప్రభుత్వ ఆడిట్ జనరల్ తో విచారణ చేయించాలని అప్పుడే అసలు విషయాలు, వాస్తవాలు వెలుగులోకి వస్తాయని, అతను చేసిన అవినీతి అక్రమాలపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కూటమి ప్రభుత్వాన్ని సిరిపురపు శ్రీధర్ కోరారు.
Also read
- అద్దె ఇంట్లోకి శవాన్ని రానివ్వని యజమాని..పుట్టెడు శోకంతో ఇంటిల్లిపాది
- Andhra: ఆటో కావాలా మేడం అంటూ ఆటో ఎక్కించుకుని… ఆ మహిళను
- బీటెక్ పట్టా ఉంది.. కానీ బతుకు భారమైంది.. మంటల్లో మాడిపోయిన యువతి కలలు!
- కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన…* బ్రాహ్మణ చైతన్య వేదిక
- గరుడపురాణం ప్రకారం ఆత్మ నరకలోక ప్రయాణంలో 8వ పట్టణం విచిత్రభవనం చేరుకోవడానికి ఎన్ని కష్టాలు పడుతుందో తెలుసా..?





