యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెంకు చెందిన కుంట్ల రాజిరెడ్డికి వృద్ధురాలైన తల్లి, సోదరుడు, సోదరి కూడా ఉన్నారు. రాజిరెడ్డి, జ్యోతిలు దంపతులు ఇద్దరూ అంధులైన దివ్యాంగులు. అయితే రాజిరెడ్డికి తన తండ్రి నుండి నాలుగు ఎకరాల భూమి సంక్రమించింది. రాజిరెడ్డి దంపతులు అందులు కావడంతో వారి బాగోగులను అతని సోదరి మంజుల, ఆమె భర్త సత్తిరెడ్డి చూసుకునేవారు. అయితే డబ్బు మీద ఉన్న మోజుతో చెల్లి రక్త సంబంధాన్ని మరిచిన అన్న ఆస్తిపై కన్నేసింది. అన్నను ఆప్యాయంగా చూసుకుంటూనే కోట్ల విలువైన భూమిని నెమ్మదిగా కాజేసింది. ఇంకా అత్యాశ చావని మంజూల తల్లి కుంట్ల సత్యమ్మ ఇంటిపై కూడా కన్నేసింది.
తన తండ్రి చనిపోయిన తర్వాత సోదరులు, తల్లికి తెలియకుండా నకిలీ పత్రాలతో మంజుల ఆ ఇంటిని తన పేరుపైకి రిజిస్ట్రేషన్ చేయించుకుంది. ఇక ఇళ్లు తనపై ఉండడంతో తన భర్తతో కలిసి వృద్ధురాలైన తల్లిని ఇంటి నుండి బయటకు గెంటేసింది.దీంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయిన తల్లి సత్తమ్మ తమకు న్యాయం చేయాలని కోరుతూ కూతురి ఇంటి ముందు ఆందోళనకు దిగింది.
రోజురోజుకూ మనుషుల మధ్య ఉన్న బంధాల కంటే డబ్బుకే ప్రాధాన్యత పెరుగుతుంది. డబ్బుపై ఉన్న మోజుతో ఇలా రక్త సంబంధాలనే దూరం చేసుకుంటున్నారు. మరి కొందరైతే ఏకంగా ప్రాణాలే తీస్తున్నారు. దీంతో మానవత్వ విలువలు మంటగలుస్తున్నాయి. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో మానవ సంబంధాలకు అర్థమే లేకుండా పోతుంది అంటున్నారు నిపుణులు.
Also read
- బచ్చలకూర అనుకుని పప్పులో గన్నేరాకు వేసి
- ‘సారీ రాధికా.. గుడ్‌బై’.. భార్య పుట్టినరోజు నాడే హైదరాబాద్ టెకీ ఆత్మహత్య
- ప్రియురాలి బర్త్‌డే.. ఐఫోన్ సర్ప్రైజ్ ప్లాన్.. చివరికి పోలీసులకు అడ్డంగా బుక్కైన లవర్స్..
- ప్రేమ పెళ్లి.. ఇద్దరు పిల్లలు.. కట్‌చేస్తే.. ఆ ఇంట్లో ఆ రాత్రి ఏం జరిగింది..?
- గన్నేరు ఆకులతో పప్పు వంట! అంగన్వాడీలో ఫుడ్ పాయిజన్.. ముగ్గురు చిన్నారులు, ఇద్దరు తల్లులకు అస్వస్థత





