Garuda Purana: గరుడ పురాణం ప్రకారం ఆత్మ యమలోకానికి వెళ్లడానికి ఒక సంవత్సర కాలం పడుతుందట. ఈ సంవత్సర కాలంలో ఆత్మ దాదాపు పదహారు పట్టణాల మీదుగా యమపురికి ప్రయాణం చేయాల్సి వస్తుందట. ఈ ప్రయాణంలో ఆత్మ ఎంత నీరసించినా ఆకలిదప్పులు వేసినా యమదూతలు ఆత్మను కొడుతూనే యమపురి వైపు తీసుకెళ్తారట. అయితే ఎవరు చేసుకున్న కర్మానుసారం వారికి ఈ శిక్షలు ఉంటాయట. వారి వారి కర్మలకు తగ్గట్టు ఈ పదహారు పట్టణాల్లో భయంకరమైన శిక్షలు విధిస్తారట. ఫైనల్ గా యమపురికి చేరుకున్న తర్వాత అక్కడ యమధర్మరాజు వేసే శిక్షలు మరింత ఘోరంగా భయానకంగా భీతిని గొల్పే విధంగా ఉంటాయట.
అయితే 16 పట్టణాల మీదుగా ఆత్మ చేసే ప్రయాణాన్ని.. ఆత్మ ఎదుర్కొనే కష్టాలను బాధలను వరుస కథనాలలో తెలుసుకుందాం.
గరుడపురాణం ప్రకారం, మరణం తర్వాత ఆత్మ తన ప్రయాణంలో 13వ రోజున యమపురి వైపు ప్రయాణాన్ని ప్రారంభిస్తుందట. ఆత్మ యమపురికి చేరుకోవడానికి సంవత్సర కాలం పడుతుందట. ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఆత్మ మొత్తం 16 పట్టణాలను దాటుకుంటూ వెళ్తుందట. యమలోక మార్గంలో ఆత్మ మొదటగా చేరుకునే పట్టణం సౌమ్యపురం, తర్వాత సౌరిపురం, నగేంద్రభవనం, గంధర్వనగరం, శైలాగమం, క్రౌంచపురం, క్రూరపురం, విచిత్రభవనం, బహుపాదపురం, దుఃఖదం, నానాక్రందపురం, సుతప్తభవనం, రౌద్రపురం, పయోవర్షణం, శీతాఢ్యం, బహుభీతిపురం ఈ 16 పట్టణాలు దాటిన తర్వాత వచ్చేది వైవస్వతపురం అంటే యమధర్మరాజు నివసించే నగరం. ఇక్కడికి చేరుకోవడానికి ఆత్మకు దాదాపు ఏడాది కాలం పడుతుందని గరుడపురాణం చెబుతుందట.
ఇక 13వ రోజున జరిపే శుభస్వీకారం లేదా పిండ ప్రదానాలు ఆత్మకు ఆ ప్రయాణంలో శక్తినిస్తాయని గరుడపురాణం చెప్తుందట. 365 రోజులు ఆత్మ ప్రయాణంలో ఆకలిదప్పులతో అలమటించకుండా దానికి శక్తిని ఇవ్వడానికి నిర్వహించే క్రతువులనే మాసికాలు అంటారట.
మాసిక పిండం అంటే ఏమిటి?: మరణించిన రోజు
నుండి ప్రతి నెలా, అదే తిథి నాడు జరిపే పిండ ప్రదానాన్ని మాసికం అంటారట. ఆత్మ ప్రయాణించే 16 పట్టణాలలో ఒక్కో పట్టణం వద్ద ఒక్కో పిండం ఆత్మకు ఆహారంగా అందుతుందని గరుడపురాణం చెప్తుందట.
షోడశ మాసికాలు (16 మాసికాలు) : మరణించి వ్యక్తికి శాస్త్రం ప్రకారం మొత్తం 16 రకాల పిండ ప్రదానాలు చేయాలట. వాటిలో ముఖ్యమైనవి ప్రథమ మాసికం. ఇది వ్యక్తి మరణించిన నెల రోజులకు చేసేది.
షోడశ మాసికాలు (16 మాసికాలు): మరణించి వ్యక్తికి
శాస్త్రం ప్రకారం మొత్తం 16 రకాల పిండ ప్రదానాలు చేయాలట. వాటిలో ముఖ్యమైనవి ప్రథమ మాసికం. ఇది వ్యక్తి మరణించిన నెల రోజులకు చేసేది. త్రైపాక్షికం.. ఇది మరణించిన 45వ రోజున చేసేదట. ద్వైమాసికం మరణించిన రెండో నెలలో చేసేదట. ఊనషాణ్మాసికం ఇది వ్యక్తి మరణించిన ఆరో నెల పూర్తికాక ముందే (సుమారు 170-180 రోజుల మధ్య) చేసేదట. షాణ్మాసికం వ్యక్తి చనిపోయిన ఆరో నెలలో చేసేదట.. ఊనాబ్దికం ఇది మరణించిన వ్యక్తి ఏడాది పూర్తికాక ముందే (సుమారు 340-350 రోజుల మధ్య) చేసేదట.. ఆబ్దికం ఇది ఏడాది పూర్తయిన తర్వాత చేసే మొదటి సంవత్సరీకమట. మిగిలిన నెలల్లో చేసే సాధారణ మాసికాలతో కలిపి మొత్తం 16 మాసికాలు పూర్తవుతాయట.
ఈ మాసికాలు ఎందుకు చేయాలి?: గరుడపురాణం
ప్రకారం, భూలోకంలో బంధువులు ఇచ్చే ఈ పిండమే ఆత్మకు వచ్చే యాతనా శరీరానికి, ఆత్మ ప్రయాణ శక్తికి మూలమవుతుందట. యమలోక మార్గంలో ఎక్కడా అన్నపానీయాలు దొరకవట. ఈ పిండాలే ఆత్మకు తృప్తినిస్తాయట. మొదటి ఏడాది అంతా ఆత్మ ప్రేత రూపంలో ఉంటుందట. ఈ 16 మాసికాలు పూర్తయ్యాక సపిండీకరణం అనే ప్రక్రియ ద్వారా ఆత్మ తన పితృదేవతల వరుసలో చేరుతుందట. అయితే సరైన సమయంలో మాసికాలు నిర్వహించకపోతే, ఆత్మ ఆకలితో అల్లాడుతూ తనవారిని శపిస్తుందని తద్వారా పితృదోషాలు కలుగుతాయని శాస్త్రం హెచ్చరిస్తోందట
మాసికాలు నిర్వహించే విధానం: సాధారణంగా
మరణించిన వ్యక్తి కుమారులు ఈ క్రతువును నిర్వహిస్తారట. ఇందులో బ్రాహ్మణ భోజనం స్వయంపాకం, పిండ ప్రదానం ప్రధానంగా ఉంటాయట. ప్రస్తుత కాలంలో చాలామంది ప్రతి నెలా చేయలేక, ఏడాది చివరలో (సపిండీకరణానికి ముందు) అన్ని మాసికాలను కలిపి షోడశ మాసికాలు గా ఒకేసారి నిర్వహిస్తున్నారట.
