కాకినాడ కాకినాడ కలెక్టరేట్ సమీపంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఈవీఎం మిషన్ల భద్రత కోసం గార్డుగా విధులు నిర్వహిస్తున్న ఒక హెడ్ కానిస్టేబుల్ తన సర్వీస్ రైఫిల్‌తో కాల్చుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటన స్థానికంగా మరియు పోలీస్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. ఘటన వివరాల్లోకి వెళ్తే.. కాకినాడ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న ధనరాజు, ప్రస్తుతం కలెక్టరేట్ సమీపంలోని ఈవీఎం భద్రతా కేంద్రం వద్ద డ్యూటీలో ఉన్నారు. సోమవారం విధుల్లో ఉండగానే, తన వద్ద ఉన్న 303 రైఫిల్‌తో ఒక్కసారిగా తనపై తాను కాల్పులు జరుపుకున్నారు. కాల్పుల శబ్దం విన్న తోటి సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, రక్తపు మడుగులో ఉన్న ధనరాజును గమనించారు. ఆయనను వెంటనే కాకినాడ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (జిజిహెచ్)కి తరలించారు.
Also read
- ఆషాఢ గుప్త నవరాత్రులు.. త్వరగా పెళ్లి జరగాలంటే ఈ రోజుల్లో తప్పక చేయాల్సిన శక్తివంతమైన పరిహారాలు
- Garuda Purana: గరుడ పురాణం ప్రకారం ఈ ముగ్గురిని యమదూతలు తాకరట.. స్వయంగా దైవదూతలే తీసుకెళ్తారట!
- Weekly Horoscope: ఆ రాశుల వారికి కొత్త ఉద్యోగం, ఆకస్మిక ధనలాభం..మీ రాశికి ఎలా ఉందంటే..?
- ఆశ్రమం పరిసరాల్లో గుప్పుమంటున్న వాసన.. ఏంటని చూస్తే అంతా షాక్..!
- భార్యాభర్తల మధ్య గొడవ.. చివరకు 18 రోజుల పసికందు పాలిట మరణశాసనం





