హైదరాబాద్: వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ ఇంటిపై జూబ్లీహిల్స్ పోలీసులు దాడి చేసి యువతితో పాటు విటుడిని అరెస్టు చేశారు. పోలీసుల సమాచారం మేరకు.. యూసుఫ్గూడ శ్రీకృష్ణానగర్ కాలనీలో వ్యభిచారం నిర్వహిస్తున్నారనే సమాచారం మేరకు పోలీసులు ఓ ఇంటిపై దాడులు చేశారు.
ఇంట్లో తనిఖీలు నిర్వహించగా అలేఖ్యరెడ్డి(26) అనే మహిళ ఆరు నెలలుగా వ్యభిచారం నడిపిస్తుందని పోలీసులు గుర్తించారు. ఆమె వెంకటేష్ అనే ఏజెంట్, రామ అనే వ్యక్తి పరిచయాల ద్వారా వ్యభిచారం నడిపస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఈ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు అలేఖ్యరెడ్డి పోలీసులకు వివరించింది. ఆమెతో పాటు విటుడు వెంకట వినయ్కుమార్(27)ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Also read
- అన్నను స్కూల్ బస్సు ఎక్కించేందుకు తల్లి వెంటే వచ్చి.. అదే బస్సు కిందపడి మూడేళ్ల బాలుడు మృతి!
- వేడి సాంబార్లో పడి మహిళ మృతి.. సీసీ కెమెరాలో షాకింగ్ దృశ్యాలు!
- విష్ణుమూర్తి నాభి నుంచే పద్మం ఎందుకు పుట్టింది? బ్రహ్మదేవుడి ఆవిర్భావం వెనుక అసలు రహస్యం ఇదే!
- దుర్ముహూర్తం అంటే ఏమిటి? ఈ సమయంలో శుభకార్యాలు ఎందుకు చేయరు? కారణం ఇదే!
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?





