కర్నాటక: ఇద్దరు పిల్లలు ఉన్న మహిళతో అక్రమ సంభందం పెట్టుకొన్న సందీప్ అనే దుండగుడు తేజస్విని (32) అనే మహిళను పొడిచి చంపాడు. ఇది చిక్కబళ్లాపురం నగరంలో జరిగింది. వివరాలు.. భర్తతో విడిపోయిన తేజస్విని ఓ హోటల్లో పని చేస్తూ అందులోనే ఓ గదిలో నివాసముంటోంది. ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.
సందీప్ (26) అనే యువకుడు ఆమెకు పరిచయమై వేరే ఇల్లు తీసుకుని సహజీవనం ప్రారంభించారు. తేజస్విని తన స్నేహితురాలు అరుణను ఇంటికి తీసుకొచ్చింది. ఇది నచ్చని సందీప్ తాగి గలాటా చేశాడు. అదే మత్తులో కత్తితో తేజస్వినిపై దాడి చేశాడు. స్థానికులు ఆమెను ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. అయితే చికిత్స ఫలించక తేజస్విని చనిపోయింది. నిందితున్ని పోలీసులు అరెస్టు చేశారు. తల్లి దూరమై ఆమె పిల్లలు అనాథలయ్యారు.
Also read
- వెంటాడి.. వేటాడి రౌడీషీటర్ హత్య
- ఠాణాలో భార్యపై కత్తితో దాడి
- తొలి ఏకాదశి.. విష్ణుమూర్తి కృప కోసం 12 రాశుల వారు చేయాల్సిన పరిహారాలు ఇవే!
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- స్లిమ్ చేస్తానని నమ్మించి.. యువతిని హోటల్ రూమ్‌కు రప్పించిన జిమ్ ట్రైనర్.. ఆపై..!





