గుంటూరులోని రిలయన్స్ స్మార్ట్ స్టోర్లో ముగ్గురు మహిళలు ఏకంగా 11 కేజీల జీడిపప్పును చాకచక్యంగా చోరీ చేశారు. తమ చీర కింద ప్రత్యేకంగా తయారుచేసిన వస్త్రాల్లో జీడిపప్పు ప్యాకెట్లను దాచిపెట్టిన వీరు స్టోర్ సిబ్బందికి అనుమానం రావడంతో పట్టుబడ్డారు. సీసీ కెమెరాల సహాయంతో నిర్వాహకులు వీరిని గుర్తించి పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు. ఈ ఘటన షాపుల్లో చోరీల పట్ల అప్రమత్తతను పెంచుతుంది.
పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ లోనూ, బంగారు దుకాణాల్లోనూ నిర్వాహకుల కళ్లు గప్పి దొంగతనాలకు పాల్పడే మహిళలను చూశాం… విలువైన పట్టు చీరలను చాకచక్యంగా చోరి చేయడంలో మహిళలది అందే వేసిన చెయ్యి. అయితే సిసి కెమెరాల పుణ్యమా అని చోరి జరిగిన తర్వాత మహిళలను గుర్తించి వారిపై కేసులు నమోదు చేయడం పరిపాటిగా మారింది. ఈ క్రమంలోనే కొంతమేరకు చోరీలు తగ్గుముఖం పట్టాయి. అయితే గుంటూరు నగరంలోని రిలయెన్స్ స్మార్ట్ స్టోర్ లో పదకొండు కేజీల జీడిపప్పు చోరి చేసిన ముగ్గురు మహిళలను గుర్తించి పోలీసులకు అప్పగించారు.
ఈ నెల 24 తేదిన మధ్యాహ్న సమయంలో ముగ్గురు మహిళలు లక్ష్మీపురంలోని రిలయెన్స్ స్మార్ట్ స్టోర్ కు వచ్చారు. స్పైసెస్ జోన్ లోకి వెళ్లిన మహిళలు చాలా సమయం అక్కడే గడిపారు. ప్రొవిజన్స్ సెలెక్ట్ చేసుకుంటున్నట్లు అక్కడక్కడే తచ్చాడారు. జీడిపప్పు ప్యాకెట్స్ ను చేతి బుట్టలో వేసుకుని పక్కకు వెళ్లడం వాటిని చీర కింద భాగంలో దాచుకొని తిరిగి మరోసారి వచ్చి మరికొన్ని ప్యాకెట్స్ తీసుకొని బుట్టలో వేసుకోవడం పక్కకు వెళ్లి వాటిని చీర కింద భాగంలో ప్రత్యేకంగా తయారు చేసిన వస్త్రాల్లో దాచుకోవడం చేశారు. అలా అరగంట పాటు అక్కడే ఉండటంతో స్టోర్ నిర్వాహకులను అనుమానం వచ్చింది. మహిళలు బిల్లు చెల్లించి వెలుతున్న క్రమంలో అనుమానం వచ్చిన నిర్వాహకులు వారిని అడ్డగించి సోదాలు చేశారు.
Also read
- ఎంతకు తెగించార్రా.. మఫ్టీ పోలీసుల పేరుతో రైతుల నిలువుదోపిడీ.. కట్ చేస్తే..
- అర్థరాత్రి ఇంట్లో నుంచి పెద్ద పెద్ద శబ్ధాలు.. అనుమానం వచ్చి ఉదయం వెళ్లి చూడగా.. వామ్మో
- ఒంటికి నిప్పంటించుకుని రోడ్డుపైకి..
- ‘నా చావుకు కారణం వెంకటేశ్..’
- కన్న కొడుకును కత్తెరతో పొడిచి చంపిన తల్లి.. ఎందుకో తెలుసా..?





