రోజురోజుకు మానవ సంబంధాలు మరింత దారుణంగా దిగజారుతున్నాయి.. వివాహేతర సంబంధాలు, శారీరక వాంఛల కోసం కన్నవారు, తోడబుట్టినవారు.. అని లేకుండా ప్రవర్తిస్తూ.. సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునేలా చేస్తున్నారు. తాజాగా.. ఓ తల్లి.. అత్యంత దారుణంగా ప్రవర్తించింది.. కన్న కుమార్తెకు నిద్రమాత్రలు ఇచ్చి ప్రియుడితో అత్యాచారం చేయించింది.. ఈ దారుణ ఘటన తమిళనాడులోని చెన్నైలో చోటుచేసుకుంది. తమిళనాడు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చెన్నై సాలి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి వాచ్‌మెన్ గా పనిచేస్తున్నాడు. ఇతనికి భార్య, 20 ఏళ్ల కుమార్తె ఉన్నారు. అతను.. వారానికి ఒకసారి మాత్రమే ఇంటికి వెళ్తుంటాడు.. ఈ నేపథ్యంలో భార్య.. ఆ ప్రాంతంలోని మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. భర్త ఇంట్లో లేని సమయంలో ప్రియుడిని పిలిపించుకుంటూ సరసాల్లో మునిగిపోయేది.. ఇది గమనించిన.. కుమార్తె.. వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని.. తల్లిని మందలించింది. తల్లి ఎంతకూ వినకపోవడంతో ఆమెతో మాట్లాడటం మానేసింది. ఈ క్రమంలో గత నెల 3వ తేదీన అనారోగ్యంతో ఉన్న కుమార్తెకి తల్లి నిద్రమాత్రలు ఇచ్చింది.. అనంతరం ప్రియుడిని పిలిపించి అత్యాచారం చేయించింది.
23వ తేదీన.. మళ్లీ యువతికి నిద్రమాత్రలు ఇచ్చిన తల్లి .. లవర్ ను పిలిపించి అత్యాచారానికి పాల్పడేలా చేసింది. ఈ క్రమంలోనే.. స్పృహలోకి వచ్చిన యువతి పెద్దగా కేకలు వేసింది.. దీంతో ఆమెను గదిలో బంధించి.. బయటకు చెప్పకూడదంటూ బెదిరించారు. ఆ తర్వాత.. ఇంటినుంచి తప్పించుకున్న యువతి తిరువణ్ణామలైలో ఉన్న బంధువు ఇంటికి వెళ్లి జరిగిన విషయం మొత్తం చెప్పి విలపించింది.
ఈ క్రమంలోనే.. కడుపునొప్పితో బాధపడుతున్న యువతిని బంధువులు ఆస్పత్రికి తీసుకెళ్లగా ఆమె గర్భంతో ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో ఆ యువతి కుటుంబసభ్యులు.. సెయ్యారు మహిళా పోలీసు స్టేషన్‌లో తల్లి, ఆమె ప్రియుడు దక్షిణామూర్తి(50) పై ఫిర్యాదు చేశారు. ఘటన జరిగింది వడపళనిలో కావడంతో వడపళని ఆల్ ఉమెన్ పోలీస్‌స్టేషన్‌కి కేసుని బదిలీ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
Also read
- 4 ఏళ్ల తర్వాత మళ్లీ బయటకొచ్చిన ర్యాగింగ్ భూతం.. జూనియర్స్ బట్టలు విప్పించి మరీ
- సినిమాలో తండ్రి.. ఇక్కడ ప్రియుడు.. రాజు వెడ్స్ రాంబాయి సీన్ రిపీట్.. కట్‌చేస్తే యువతి..
- జలపాతంలో మునిగి ముగ్గురు గిరిజన యువతుల మృతి
- ఈ లేడి మామూల్ది కాదు.. ఆసుపత్రిలో పిల్లాడు ఏడుస్తుంటే పాలిస్తానని తీసుకుంది.. ఆ తర్వాత..
- అమానుషం.. అంగన్వాడి టీచర్‌ను చెట్టుకు కట్టేసిన గ్రామస్తులు.. ఏం జరిగిందంటే?





