TDP On Tuni Incident: తూర్పుగోదావరి జిల్లా తునిలో 8వ తరగతి బాలికపై నారాయణ రావు అనే వృద్ధుడు పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై టీడీపీ స్పందించింది. సభ్య సమాజం తలదించుకునేలా జరిగిన ఈ ఘటన క్షమించరానిదని అభిప్రాయపడింది. ఇటువంటి చర్యలను కూటమి ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని స్పష్టం చేసింది. ఎంతటి వారినైనా, ఏ పార్టీకి చెందిన వారినైనా కఠినంగా శిక్షిస్తుందని పేర్కొంది. టీడీపీకి సంబంధించిన ఏ విభాగంలో కూడా నిందితుడికి ఏ పదవీ లేదని స్పష్టం చేసింది.
తప్పు చేస్తే నాయకులకైనా, సామాన్యులకైనా ఒకే శిక్షలు ఉంటాయని టీడీపీ ఎక్స్ వేదికగా స్పష్టం చేసింది.

ఇప్పటికే నిందితుడిపై కేసులు నమోదు చేసి, అరెస్ట్ చేసి రిమాండుకు పంపుతున్నారు. కఠినమైన శిక్షలు పడేలా పోలీసుల చర్యలు తీసుకుంటున్నారు.
తుని ఘటన షాక్ కు గురిచేసింది- మంత్రి లోకేశ్
తుని రూరల్ గురుకుల పాఠశాల విద్యార్థినిపై తాటిక నారాయణరావు అనే కామాంధుడు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై తనను షాక్ కు గురిచేసిందని మంత్రి లోకేశ్ ఎక్స్ వేదిక పోస్టు పెట్టారు. ఈ ఘటన వివరాలు తెలిసిన వెంటనే పోలీసులు అతడిపై పోక్సో కేసు నమోదు చేసి అరెస్టు చేశారన్నారు. ఇటువంటి ఘటనలకు పాల్పడే వాడెవరైనా ఉక్కుపాదంతో అణచివేస్తామన్నారు. బాధితురాలు ధైర్యంగా ఉండేలా కౌన్సిలింగ్ ఇచ్చి, అన్నివిధాలా సహాయ, సహకారాలు అందిస్తామన్నారు. గురుకుల పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లలో చదువుకునే విద్యార్థినులకు పటిష్టమైన భద్రత కల్పించాల్సిందిగా అధికార యంత్రాంగానికి ఆదేశాలు ఇచ్చారు.
గురుకుల బాలికపై వృద్ధుడి అఘాయిత్యం
తూర్పు గోదావరి జిల్లా తునిలో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. బాలికపై అత్యాచారం చేశాడని ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
హంసవరం ప్రాంతానికి చెందిన నారాయణరావు అనే వృద్ధుడు, తుని రూరల్ గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న బాలికపై పలుమార్లు అత్యాచారం చేశాడు. బాలిక తాత అని చెప్పి హస్టల్ నుండి బాలికను బయటకు తీసుకువెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
హంసవరం సమీపంలోని సపోటా తోటల్లో బాలికతో ఉన్న వృద్ధుడిని పట్టుకోగా.. తాను టీడీపీకి చెందిన వాడినని బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. గతంలో కూడా బాలికను బయటకు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.
Also read
- Telangana: ఇంతకాలం టైంపాస్కి లవ్ చేశావా..? అమ్మాయి చెప్పిన ఆ ఒక్క మాటతో..
- మామిళ్ళగూడెం మృత్యుఘోష.. నిన్న తండ్రి, కూతురు.. నేడు తల్లి.. ఆ ఇంట్లో ఏం జరిగింది?
- స్క్రీన్ ప్లే అదిరింది కానీ.. సీన్ మార్చేసిన క్యూఆర్ కోడ్! చండ్రుపట్ల కాలువ మృతదేహం కేసులో దిమ్మతిరిగే ట్విస్ట్!
- నకిలీ రికమండేషన్ లెటర్స్ కలకలం.. తిరుమలలో అడ్డంగా దొరికిపోయిన మోసగాడు..!
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?





