తూర్పు గోదావరి జిల్లా: మండలంలోని సింగన్నగూడెం వద్ద జాతీయ రహదారి-30లో ఆదివారం కారు అదుపుతప్పి రెయిలింగ్‌ను ఢీకొంది. ఈ ఘటనలో ఒడిశాకు చెందిన పురేష్ గౌడ్ (22) మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. ఒడిశాకు చెందిన 9 మంది కూలీలు తమిళనాడుకు కూలి పనుల నిమిత్తం వెళ్లి కారులో తిరిగి స్వరాష్ట్రం వెళుతున్న క్రమంలో సింగన్నగూడెం వద్ద కొత్తగా నిర్మించిన రహదారి పక్కనే ఉన్న రెయిలింగ్‌ను బలంగా ఢీకొన్నారు.
రెయిలింగ్ విరిగిపోవడంతో పాటు కారు ముందు భాగం నుంచి మధ్యలోని సీటు భాగంలోకి దూసుకుపోయింది. ఈ ఘటనలో పురేష్ గౌడ్ కడుపులోకి రెయిలింగ్ గుచ్చుకోవడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ముగ్గురికి గాయాలు కాగా, ఇందులో జన్మతి అనే మహిళ పరిస్థితి విషమంగా ఉంది. మెరుగైన వైద్యం నిమిత్తం భద్రాచలం తరలించారు. ఘటనా స్థలాన్ని ఏఎస్పీ బొడ్డు హేమంత్, ఎస్ఐ సురేష్ పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
Also read
- ఎంతకు తెగించార్రా.. మఫ్టీ పోలీసుల పేరుతో రైతుల నిలువుదోపిడీ.. కట్ చేస్తే..
- అర్థరాత్రి ఇంట్లో నుంచి పెద్ద పెద్ద శబ్ధాలు.. అనుమానం వచ్చి ఉదయం వెళ్లి చూడగా.. వామ్మో
- ఒంటికి నిప్పంటించుకుని రోడ్డుపైకి..
- ‘నా చావుకు కారణం వెంకటేశ్..’
- కన్న కొడుకును కత్తెరతో పొడిచి చంపిన తల్లి.. ఎందుకో తెలుసా..?





