తిరుమల లడ్డూ తయారీకి ఉపయోగించిన కల్తీ నెయ్యి అంశం రాజకీయాలు లేదా ఏ మతాన్నీ లక్ష్యంగా చేసుకోవడానికి సంబంధించినది కాదని ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ఇది విశ్వాసం, జవాబుదారీతనానికి సంబంధించినదని ఆయన చెప్పారు
అమరావతి, ఫిబ్రవరి 7: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో ఉపయోగించిన నకిలీ నెయ్యి వివాదంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక వీడియో విడుదల చేశారు. సోషల్ మీడియా మాధ్యమం ‘ఎక్స్’ ఖాతాలో సదరు వీడియో పోస్ట్ చేశారు. తిరుమల లడ్డూ తయారీకి ఉపయోగించిన కల్తీ నెయ్యి అంశంపై సీబీఐ–సిట్(Special Investigation Team) దర్యాప్తు నివేదికల గురించి పవన్ ఈ వీడియోలో వివరించారు
ఈ అంశం రాజకీయాలకు లేదా ఏ మతాన్నీ లక్ష్యంగా చేసుకోవడానికి సంబంధించినది కాదన్న పవన్.. ఇది విశ్వాసం, జవాబుదారీతనానికి సంబంధించినదని అన్నారు. ఈ విషయంలో ప్రమేయం ఉన్నవారిని చట్ట ప్రకారం జవాబుదారీగా చేస్తారని.. న్యాయం జరిగే వరకూ ఎన్డీఏ ప్రభుత్వం ఈ విషయాన్ని కొనసాగిస్తుందని పవన్ తన వీడియో సందేశంలో పేర్కొన్నారు.
Also read
- అన్నను స్కూల్ బస్సు ఎక్కించేందుకు తల్లి వెంటే వచ్చి.. అదే బస్సు కిందపడి మూడేళ్ల బాలుడు మృతి!
- వేడి సాంబార్లో పడి మహిళ మృతి.. సీసీ కెమెరాలో షాకింగ్ దృశ్యాలు!
- విష్ణుమూర్తి నాభి నుంచే పద్మం ఎందుకు పుట్టింది? బ్రహ్మదేవుడి ఆవిర్భావం వెనుక అసలు రహస్యం ఇదే!
- దుర్ముహూర్తం అంటే ఏమిటి? ఈ సమయంలో శుభకార్యాలు ఎందుకు చేయరు? కారణం ఇదే!
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?





