తమిళనాడు: కులాంతర వివాహం చేసుకున్నాడనే నెపంతో
నాలుగేళ్లుగా గ్రామానికి రానివ్వకుండా బహిష్కరించి, వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తూ బాధితుడు సోమవారం ఉదయం కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసనకు దిగారు. తిరువళ్లూరు జిల్లా గుమ్మిడిపూండి తాలూకా ఓబులాపురం గ్రామానికి చెందిన ప్రేమ్(27). ఇతను ఎంబీసీ కులానికి చెందిన వ్యక్తి. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన మత్స్యకార కుటుంబానికి చెందిన భానుమతి(24)ని ప్రేమించి నాలుగేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు.
దీంతో గ్రామ పెద్దలు ప్రేమ్ తోపాటు అతడి కుటుంబ సభ్యులను గ్రామ బహిష్కరణ చేసినట్టు తెలుస్తుంది. దీంతోపాటు గ్రామంలోకి ప్రవేశించకూడదని, ఆలయంలోని గుడికి రాకూడదు, గ్రామంలో వెళ్లకూడదు, శుభ కార్యంలో పాల్గొన కూడదని నిబంధన విధించారు. దీంతో పాటు గత రెండు రోజుల క్రితం తన ఇంటిని సైతం ధ్వంసం చేశారని, ఇదే విషయంపై ఆరంబాక్కం పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు వివరించాడు. తమను గ్రామ బహిష్కరణ చేసి చిత్రహింసలకు గురి చేస్తున్న వారిపై చర్యలు తీసుకోడంతోపాటు తమకు భద్రత కల్పించాలని కోరుతూ బాధితుడు తల్లిదండ్రులు, భార్యతో కలిసి ఆందోళన నిర్వహించాడు.
Also read
- పోలీస్ స్టేషన్లో కాల్పుల కలకలం.. AK-47తో కాల్చుకుని ఎస్ఐ ఆత్మహత్యాయత్నం!
- మధ్యాహ్న భోజన పథకం కార్మికుల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి….. గ్రీష్మ కుమార్, ఐ.యఫ్టియు రాష్ట్ర కమిటీ సభ్యులు.
- Ganesh Chaturthi: గణేశుడికి ఏనుగు తల ఎలా వచ్చింది? గజాసురుడి తలనే ఎందుకు పెట్టారు.. అసలు కథ ఇదే!
- భాద్రపద మాసం.. వినాయక చవితి నుంచి మహాలయ అమావాస్య వరకు.. ఈ మాసంలోని పండగలివే!
- వినాయక చవితి వేళ అద్భుత గ్రహ యోగాలు.. ఈ రాశుల వారికి గణపతి ఆశీస్సులతో పట్టిందల్లా బంగారమే!





