ఆత్మహత్యజగిత్యాల : ప్రేమపేరుతో ఓ యువకుడి వేధింపులు భరించలేక యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన జగిత్యాల రూరల్ మండలం అనంతారం గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. రూరల్ ఎస్సై ఉమాసాగర్ వివరాలు వెల్లడించారు. గ్రామానికి చెందిన సైదు శ్రీలత (20) జగిత్యాల పట్టణంలో ఇటీవలే డిగ్రీ పూర్తి చేసింది.
ఈ క్రమంలో మూడేళ్లుగా జగిత్యాల రూరల్ మండలం సంగంపల్లి గ్రామానికి చెందిన అంకతి రాజు ప్రేమ పేరుతో శ్రీలతను వేధిస్తు న్నాడు. తనకు ఇష్టం లేదని చెప్పినా వినకుండా వెంటపడుతుండటంతో శ్రీలత మూడేళ్ల కిందటే ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా.. కుటుంబసభ్యులు కాపాడారు.
అయినప్పటికీ యువకుడి వేధింపులు తీవ్రం కావడంతో కుటుంబ సభ్యులు అతడిని మందలించారు. అయినా మార్పు రాకపోగా.. సోమవారం శ్రీలతకు ఫోన్ చేసి తీవ్ర వేధింపులకు గురిచేయడంతో మనస్తాపానికి గురై ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తండ్రి సత్తయ్య ఫిర్యాదు మేరకు రాజుపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఉమాసాగర్ తెలిపారు.
Also read
- అయ్యో ఎంత పని చేశావ్ తల్లి.. ఉరివేసుకొని 5వ తరగతి బాలిక ఆత్మహత్య.. ఎందుకంటే?
- అయ్యో అనిత.. మరికాసేపట్లో డెలివరీ.. అంతలోనే వైద్యులు వచ్చి ఏం చెప్పారంటే..
- ఎంతకు తెగించార్రా..! రూ.30 వేల అప్పు కోసం 21 రోజుల పసికందు కిడ్నాప్..!
- Hyderabad: అంతా పక్కా స్కెచ్.. బెడిసికొట్టిన ఫ్లాన్.. ఏటీఎం చోరీ కేసులో సంచలన ట్విస్ట్!
- అనారోగ్యంతో ఆస్పత్రికి వెళ్తే.. నువ్వు చనిపోయావ్గా అన్నారు.. అసలు ఏమైందంటే..?





