SGSTV NEWS online
Andhra PradeshCrime

Crime News: మద్యం మత్తులో చెవి కొరికిన యువకుడు..



పులివెందుల, సింహాద్రిపురం, : మద్యం మత్తులో ఓ యువకుడు మరో వ్యక్తి చెవి కొరికి తీవ్రంగా గాయపరిచాడు. ఈ ఘటన వైఎస్సార్ కడప జిల్లా సింహాద్రిపురం మండల పరిధిలో శనివారం అర్ధరాత్రి జరిగింది. పోలీసుల కథనం ప్రకారం రావులకొలను గ్రామానికి చెందిన వై.మౌనీశ్వరరెడ్డి, కె. రాజశేఖర్రెడ్డి కలిసి మద్యం తాగుతూ ఉండగా.. మాటామాటా పెరిగి ఘర్షణకు దిగారు. ఈ క్రమంలో రాజశేఖర్రెడ్డి.. మౌనీశ్వరరెడ్డి చెవి కొరకడంతో పాటు రాయితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. అతడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పులివెందుల గ్రామీణ సీఐ రమణ తెలిపారు.

Also Read

Related posts