నెల్లూరు : వ్యక్తిపై హత్యాయత్నం చేసిన నిందితులను శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరులోని వేదాయపాలెం పోలీసులు ఆదివారం రాత్రి నగరంలో రోడ్డుపై నడిపించారు. పోలీసుల కథనం మేరకు.. స్టేషన్ పరిధిలోని అంబాపురం యల్లమ్మగుడి సమీపంలో నివాసం ఉంటున్న మనిదేవి అలియాస్ దేవపై ఈ నెల 16న రాత్రి రౌడీషీటర్లు రవి అలియాస్ ఏక్బాల్, కృష్ణసాయి అలియాస్ కిట్టులతో పాటు వాసు, హుస్సేన్, మరో ఐదుగురు బాలురు హత్యాయత్నం చేశారు. వాహనాన్ని పక్కకు తీయనందుకు అతనిపై దాడి చేశారు. ఈ ఘటనపై దేవ భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. నగర డీఎస్పీ దీక్ష పర్యవేక్షణలో గాంధీ బొమ్మ నుంచి వీఆర్సీ సెంటరు వరకు నలుగురు నిందితులను రోడ్డుపై నడిపించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదని పోలీస్ అధికారులు హెచ్చరించారు.
Also Read
- చెంబులో ‘కీ’… అదే కలిసొచ్చింది దొంగలకి
- ఫేస్ బుక్ లో వల.. సహజీవనం తర్వాత అసలు రంగు!
- భర్త కువైట్‌లో.. భార్య కడపలో.. డ్రైవర్‌తో అలా కనిపించే సరికి..
- విశాఖ ప్రమాద బాధితులకు కోటిరూపాయల పరిహారం ఇవ్వాలి…… గ్రీష్మ కుమార్ ఐ.యఫ్.టీ.యు రాష్ట్ర కమిటీ సభ్యులు.
- భార్యభర్త మధ్యలో ప్రియుడు.. ఆయన లేడని ఇంటికి పిలిచింది.. తర్వాతి సీన్ ఇదే..





