ఇద్దరు వ్యక్తులు.. ఆటో నిండా ఏవో తీసుకుని వస్తున్నారు.. అనుమానం రావడంతో అధికారులు ఆటోను ఆపారు.. పొంతన లేని సమాధానాలు చెప్తుండటంతో వారిని అదుపులోకి చెక్ చేశారు.. ఆటోలో ప్రత్యేక అర ఏర్పాటు చేసుకుని.. తాబేళ్లు స్మగ్లింగ్ చేస్తున్నట్లు అధికారులు నిర్ణయానికి వచ్చారు.. వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. భారీగా తాబేలు పట్టుబడిన సంఘటన అల్లూరి జిల్లా చింతూరు ఏజన్సీలో చోటుచేసుకుంది. రావులపాలెం నుండి వడిసాకు అక్రమంగా తరలిస్తున్న తాబేలను అటవీశాఖ అధికారులు గుర్తించి అడ్డుకున్నారు. చింతూరు మండలం తులసిపాక ఫారెస్ట్ చెక్ పోస్ట్ వద్ద తాబేలు తరలిస్తున్న వాహనాన్ని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. తాబేళ్ల రవాణాకు అనువుగా ఉండేలా తయారుచేసిన ఆటోలో 248 తాబేలను గోనె సంచుల్లో మూటలు కట్టి తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు.
ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. పట్టుబడ్డ తాబేళ్లలో 18 తాబేలు మృతి చెందగా మిగిలిన 230 తాబేలు సోకిలేరు వాగులో విడిచిపెట్టారు. అక్రమంగా తాబేలును తరలిస్తే కఠిన చర్యలు తప్పవంటూ అటవీశాఖ అధికారులు హెచ్చరించారు. తాబేళ్లు ఎక్కడ నుంచి తీసుకువస్తున్నారు.. ఎవరి కోసం తరలిస్తున్నారన్న దానిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు
Also Read
- గురు పూర్ణిమను వ్యాస పౌర్ణమి ఎందుకు అంటారు? ఈ పవిత్ర రోజున ఏం చేస్తే శుభఫలితాలు కలుగుతాయో తెలుసా..?
- చాక్లెట్ కొనిస్తానని చెప్పి నాలుగేళ్ల చిన్నారిని..
- Andhra: నోటి దురుసు ఎంతపనిచేసింది.. భార్య వెళ్లిందని అలా మాట్లాడితేనే కొట్టి చంపేస్తారా..?
- హీటర్ ప్రాణం తీసింది..
- ఇంత కరువు పట్టి ఉన్నారేంట్రా.. స్థంభాలకున్న కరెంట్ తీగలనూ వదల్లేదు..





