ఓ మహిళను ఎద్దు రూపంలో మృత్యువు కబలించింది. చెత్త వేసేందుకు వెళ్లిన మహిళపై అక్కడే ఉన్న ఓ ఎద్దు బలంగా దాడి చేసింది. ఈ దాడిలో ఆ మహిళ అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు విడిచింది. అందరూ చూస్తుండగా జరిగిన ఈ విషాద ఘటన మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఓ మహిళను ఎద్దు రూపంలో మృత్యువు కబలించింది. చెత్త వేసేందుకు వెళ్లిన మహిళపై అక్కడే ఉన్న ఓ ఎద్దు బలంగా దాడి చేసింది. ఈ దాడిలో ఆ మహిళ అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు విడిచింది. అందరూ చూస్తుండగా జరిగిన ఈ విషాద ఘటన మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది.
మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలం కృష్ణకాలనీ ఏ సెక్టార్ లో నివాసం ఉంటున్న ఒనపాక కళావతి అలియాస్ కమలమ్మ (52) బుధవారం (నవంబర్ 12) మున్సిపాలిటీ చెత్త బండి ఇంటి సమీపంలోకి రావడం చెత్త వేసేందుకు బయటకు వచ్చింది. కళావతి చెత్తను బండిలో వేసేందుకు వెళ్లగా అక్కడే ఉన్న ఓ ఎద్దు హఠాత్తుగా ఆమెపై దాడి చేసింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ కమలమ్మ అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు విడిచింది. మృతురాలికి ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు ఉండగా.. భర్త ఏడాది క్రితం చనిపోయాడు. తాజాగా ఎద్దు రూపంలో తల్లి మృతి చెందడంతో ఆ కుటుంబ శోకసంద్రంలో మునిగిపోయింది
Also Read
- బ్రహ్మ ముహూర్తమే కాదు.. సాయంత్రం ఈ గంటలో దీపం వెలిగిస్తే లక్ష్మీ కటాక్షం, రాజయోగం కలుగుతాయట!
- నిజ జ్యేష్ఠ మాసం మొదలు.. ఈ పూజలు, దానాలు చేస్తే ఐశ్వర్యం, ఆరోగ్యం మీ సొంతమట!
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- పాము కాటు.. తండ్రి పగ.. కొడుకును చంపిన త్రాచును వేటాడి చంపాడు.. ఎక్కడంటే..
- ఏంటక్కా మరీ ఇలా ఉన్నావ్.. స్కెచ్ వేసింది.. సైలెంట్‌గా సెలైన్‌తో పనికానిచ్చేసింది





