శ్రీకాకుళం జిల్లాలో తీవ్ర విషాదం వెలుగు చూసింది. కాశీబుగ్గ వెంకటేశ్వర దేవాలయంలో అపశృతి చోటుచేసుకుంది. ఉదయం ఆలయంలో తొక్కిసలాట కారణంగా 9 మంది భక్తులు మృతి చెందారు. మరికొందరు గాయపడ్డారు. శనివారం ఏకాదశి కావడంతో ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారు. దీంతో ఆలయంలో ఒక్కసారిగా భక్తుల రద్దీ పెరిగిపోయింది. ఈ క్రమంలో భక్తులకు సపోర్టుగా ఉన్న రెయిలింగ్ ఊడిపోవడంతో భక్తులు కిందపడిపోయారు. తప్పించుకునే క్రమంలో ఒక్కసారిగా తోపులాట, తొక్కిసలాట జరిగింది. దీంతో అప్రమత్తమైన ఆలయ సిబ్బంది వెంటనే గాయనపడిన వారిని స్థానిక హాస్పిటల్‌కు తరలించారు. మరోవైపు ఆలయంలో ఎలాంటి భద్రతా చర్యలు తీసుకోకపోవడంతోనే తొక్కిసలాట జరిగినట్టు భక్తుల ఆరోపిస్తున్నారు.
ప్రమాదానిక గల కారణాలు
అయితే ఆలయ అధికారులు మాత్రం 3 వేల మంది భక్తులు వస్తే సరిపోయేలా సౌకర్యాలు చేశామని చెబుతున్నారు. కానీ ఇవాళ ఎకాదశి కావడంలో 25 వేల మందికి పైగా భక్తులు తరలివచ్చినట్టు తెలుస్తోంది. తెల్లవారుజాము నుంచే భక్తులు పోట్టెత్తడంతో కంట్రోల్ చేయడంలో అధికారులు వైఫల్యమైనట్టు తెలుస్తోంది.
కాశీబుగ్గ ఆలయ చరిత్ర
కాశీబుగ్గలోని ఈ ఆలయం 5 ఎకరాల్లో ఉంటుంది. స్థానికులు దీన్ని ఉత్తరాంధ్ర చిన్న తిరుపతిగా చెప్తూ ఉంటారు. కాశీబుగ్గకు చెందిన ఓ భక్తుడు “హరి ముకుంద పాండా” అనే భక్తుడు ఈ ఆలయాన్ని కట్టించారు. తిరుమల ఆలయ నమూనాను స్ఫూర్తిగా తీసుకుని ఆయన ఈ ఆలయాన్ని నిర్మించారు. గతంలో తాను తిరుమల దర్శనానికి వెళ్లినప్పుడు ఎదురైన ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని.. స్థానికంగా అదే తిరుమల నమూనాతో ఈ గుడి కట్టించారు. ఏడాది క్రితమే ఈ గుడి నిర్మాణం పూర్తయ్యింది. ఈ ఆలయంలో కార్యకలాపాలు ప్రస్తుతం ఆయన ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయి. ప్రస్తుతం కార్తీకమాసం.. పైగా ఇవాళ ఏకాదశి కావడంతో భక్తులు ఎక్కువ సంఖ్యలో రావడంతో తొక్కిసలాట జరిగి విషాదం చోటు చేసుకుంది.
సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
కాశీబుగ్గ వెంకటేశ్వరాలయం తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తొక్కిసలాట ఘటన కలిచివేసిందన్నారు.. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. భక్తులు మరణించడం అత్యంత విషాదకరమన్నారు. గాయపడినవారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. స్పాట్‌కి వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించాలని ప్రజాప్రతినిధులకు సూచించారు.
Also read
- Telangana: ప్రేమించానన్నాడు.. శారీరికంగా కలిశాడు.. కట్ చేస్తే.. పిల్లాడు పుట్టేసరికి
- ఇదేం పోయేకాలం రా.. ఇంట్లో పూజ చేసుకుంటున్న మహిళపై..!
- Garbarakshambigai: మహిళామూర్తులకు సుఖ ప్రసవం చేసేందుకు సాక్షాత్తు జగన్మాత వెలిసిన క్షేత్రం-‘గర్భరక్షాంబిక ఆలయం’, తిరుకరుకావుర్
- నేటి జాతకములు…3 నవంబర్, 2025
- వికారాబాద్‌లో దారుణం.. వదిన, భార్య, పిల్లలను కొడవలితో నరికి చంపి, ఆపై భర్త సూసైడ్!





