డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో ఓ కసాయి కొడుకు భార్యతో కలిసి కన్న తల్లినే కత్తితో పొడిచి దారుణంగా చంపాడు. అనంతరం దంపతులు ఇద్దరూ పారరయ్యారు. రంగంలోకి దిగిన పోలీసులు పరారైన కశాయి కొడుకు, అతడి భార్యను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఈ దారుణ ఘటన శ్రీ సత్యసాయి జిల్లా
కదిరి, అక్టోబర్ 20: తాను అడిగిన డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో ఓ కసాయి కొడుకు భార్యతో కలిసి కన్న తల్లినే కత్తితో పొడిచి దారుణంగా చంపాడు. అనంతరం దంపతులు ఇద్దరూ పారరయ్యారు. రంగంలోకి దిగిన పోలీసులు పరారైన కశాయి కొడుకు, అతడి భార్యను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఈ దారుణ ఘటన శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..
శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలోని నిజాంవలి కాలనీలో తల్లి ఖాసీమ్-భీని కొడుకు బాబా ఫక్రుద్దీన్, అతడి భార్య రసూల్-భీ కలిసి వారం రోజుల క్రితం కట్టె, కత్తి తీసుకొని కొట్టి చంపారు. అనంతరం ఇద్దరూ పరారైనట్లు మృతురాలు కుమార్తె అమ్మాజాన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన తల్లిని చంపిన అన్న, వదినలు.. పారిపోతూ తల్లి వద్ద నుంచి కొంత నగదు, మూడు తులాల బంగారం, ఇంటి పత్రాలను దోచుకెళ్లినట్లు ఫిర్యాదులో మృతురాలు కూతురు అమ్మాజాన్ పేర్కొంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను పట్టుకుని, వారి వద్ద నుంచి మూడు తులాల బంగారం, ఇంటి పత్రాలు స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించారు. కన్నతల్లిని చంపిన కొడుకు, అతనికి సహకరించిన అతడి భార్యను కోర్టు ముందు హాజరుపరచగా.. కోర్టు 14 రోజులు రిమాండ్ విధించించింది. దీంతో పోలీసులు వారిద్దరినీ జైలుకు తరలించారు.
Also read
- Diwali: దక్షిణ భారతంలో దీపావళి అంటే నరకాసుర వధే.. శ్రీకృష్ణుడి విజయగాథ వెనుక అసలు కథ ఇదే!
- దీపావళి వేళ దర్శించాల్సిన మహాలక్ష్మీ ఆలయాలు.. ఈ ఆలయాల విశిష్టత తెలిస్తే తప్పక వెళ్లాలనిపిస్తుంది!
- Diwali 2026: దీపావళి నాడు ఏ రాశి వారు ఏ దేవతను పూజించాలి? ఇంట సిరుల వర్షమే!
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- Hydearabad: ఇన్స్టాలో పరిచయమైన యువకుడిని నమ్మి రూ.10లక్షలు కోల్పోయిన యువతి





