భారత్‌లో రోజు రోజుకు వైవాహిక సంబంధాలు దిగజారిపోతున్నాయనడానికి ఈ సంఘటనే ఓ నిదర్శనం. భార్య ఉండగానే మరో మహిళతో, భర్త ఉండగానే మరో మగాడితో తిరిగే పాశ్చాత్య కల్చర్ దేశంలో పెరిగిపోతుంది. అలాంటి సంఘటనలు రోజుకు అనేకం వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలో వైవాహిక సంబంధాలు మధ్యలోనే…
భారత్‌లో రోజు రోజుకు వైవాహిక సంబంధాలు దిగజారిపోతున్నాయనడానికి ఈ సంఘటనే ఓ నిదర్శనం. భార్య ఉండగానే మరో మహిళతో, భర్త ఉండగానే మరో మగాడితో తిరిగే పాశ్చాత్య కల్చర్ దేశంలో పెరిగిపోతుంది. అలాంటి సంఘటనలు రోజుకు అనేకం వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలో వైవాహిక సంబంధాలు మధ్యలోనే తెగిపోతున్నాయి. తాజాగా అలాంటి ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రియురాలితో రోడ్డుపై తిరుగుతున్న భర్తను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది భార్య. నడిరోడ్డుపై భర్త, అతడి ప్రియురాలికి బడితె పూజ చేసింది.
ఉత్తర ప్రదేశ్‌లో గురువారం చోటుచేసుకుంన్న ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాన్పూర్‌కు చెందిన ఓ వ్యక్తి అదే ప్రాంతానికి చెందిన యువతితో గత కొంతకాలంగా వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం అతడి భార్య చెవిన పడటంతో కుటుంబంలో తగాదాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో గురువారం ఆ వ్యక్తి తన ప్రియురాలితో నర్వాల్ మోద్ ఏరియాలో భార్య కంటపడ్డాడు. వెంటనే భర్తను నిలదీసింది. ఈ క్రమంలో భార్య, ప్రియురాలు నడి రోడ్డు మీదే జుట్లు పట్టుకుని కొట్టుకున్నారు. కొద్దిసేపటి తర్వాత భార్యకు సర్దిచెప్పి ఇంటికి పంపడంతో గొడవ సరద్దుమణిగింది.
ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోపై సోషల్ మీడియా యూజర్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇటీవల ఇలాంటి సంఘటనలు ఎక్కువైపోయాయంటూ పోస్టులు పెడుతున్నారు. భార్యాభర్తల బంధం అంటే బూతులా మారిపోయింది అంటూ మండిపడుతున్నారు
Also read
- Astro Tips for Marriage: గ్రహ శాంతి పూజ అంటే ఏమిటి? వివాహానికి ముందు గ్రహ శాంతి పూజను ఎందుకు చేస్తారో తెలుసా..
- శివ శక్తి రేఖ: పూర్వీకుల మేధస్సుకి చిహ్నం ఈ 8 శివాలయాలు.. ఒకే రేఖాంశం పై నిర్మాణం..
- మీరు వచ్చే జన్మలో ఎలా పుట్టనున్నారు.? మీరు చేసే పనులే ఆ విషయం చెబుతాయి..
- నేటి జాతకములు…8 డిసెంబర్, 2025
- ఒకరితో ప్రేమ… మరొక అమాయకుడితో పెళ్లి!





