తితిదే వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లను భక్తులకు అధిక ధరలకు విక్రయించి, మోసగించిన దళారీని విజిలెన్స్ అధికారులు గురువారం అదుపులోకి తీసుకున్నారు.
తిరుమల, : తితిదే వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లను భక్తులకు అధిక ధరలకు విక్రయించి, మోసగించిన దళారీని విజిలెన్స్ అధికారులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. తితిదే వింగ్ ఏవీఎస్ వో పద్మనాభన్ కథనం మేరకు.. తమిళనాడులోని సేలంకు చెందిన భక్తుడు కృష్ణస్వామి శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు చెందిన రాజశేఖర్ ను సంప్రదించారు. ఆయనకు 7 వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లు ఇప్పించేందుకు రాజశేఖర్ రూ.27 వేలు తీసుకున్నాడు. అనంతరం తితిదే పాలకమండలి సభ్యుడు సౌరభ్ సిఫార్సు లేఖ ఆధారంగా రాజశేఖర్ టికెట్లు పొందాడు. తితిదే విజిలెన్స్ వింగ్ అధికారులు గుర్తించి రాజశేఖర్‌ను అదుపులోకి తీసుకొని, తిరుమల పోలీసులకు అప్పగించి కేసుపెట్టారు.
Also read
- ‘వివాహం’ ఆలస్యమవుతోందా? – శిల రూపంలో ఉన్న ఈ ‘నరసింహస్వామి’ని దర్శిస్తే చాలు!
- శ్రీరాముడు సంధించిన బాణంతో ఏర్పడిన వేడినీటి సరోవరం!- ఒక్కసారి దర్శిస్తే రోగాలు మటుమాయం!
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- Software Engineer S*uicide: ‘పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతా’.. ప్రియుడికి వీడియో కాల్ చేసి సాఫ్ట్వేర్ ఇంజినీర్ అర్చన ఆత్మహత్య.!
- మాదాపూర్ లో వ్యభిచార ముఠా గుట్టురట్టు



