బొబ్బిలి : విజయనగరం జిల్లా బొబ్బిలిలో విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ గొడవలో ఓ విద్యార్థి మృతిచెందాడు. పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. సహ విద్యార్థి దాడి చేయడంతో 9వ తరగతి విద్యార్థి సుందరాడ కార్తీక్ కిందపడిపోయాడు. దీంతో అక్కడున్నవారు ఆ విద్యార్థిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే విద్యార్థి మృతిచెందినట్లు తెలిపారు.
ఈ ఘటనపై కార్తీక్ తల్లితండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సతీశకుమార్ తెలిపారు. ఘర్షణకు గల కారణాలపై ఆరా తీస్తున్నట్లు చెప్పారు.
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025